AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు ఇలా

చాలా మంది హీరోయిన్స్.. కొన్ని సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకుంటూ ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఆమె ఎవరో కాదు

Rajeev Rayala
|

Updated on: Jun 16, 2026 | 2:00 PM

Share
ఈ ఫొటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే కాదు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్స్ లో ఈ చిన్నది ఒకరు. మలయాళీ చిత్రపరిశ్రమకు చెందిన ఈ అమ్మాయి బాలనటిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత  హీరోయిన్ గా మారి వెండితెరపై సందడి చేసింది.

1 / 5
తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో హీరోయిన్ గానూ సక్సెస్ అయ్యింది. పేరుకు మలయాళీ అయినా తెలుగులోనే ఎక్కువగా క్రేజ్ సొంతం చేసుకుంది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా ఉండే ఈ భామ తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, నాని వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.

2 / 5
అతి తక్కువ సమయంలో భారీగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు అంతగా అవకాశాలు రాలేదు. కానీ చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇన్నాళ్లు హీరోయిన్ ప్రేక్షకులను అలరించిన ఈ వయ్యారి.. తొలిసారిగా అమ్మ పాత్రలో కనిపించి అద్భుతమైన నటనతో ఆశ్చర్యపరిచింది. నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

3 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నివేదా థామస్. ఇటీవలే 35 చిన్న కథ కాదు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ మూవీలో నటించింది. ఇందులో అమ్మ పాత్రలో మెప్పించింది. 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించింది నివేదా.  2002లో మలయాళంలో ఉత్తర అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత బుల్లితెరపై మై డియర్ భూతం అనే సీరియల్ ద్వారా ప్రేక్షకులను అలరించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో కథానాయికగా పరిచయమైంది.

4 / 5
ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రేచేవారెవరురా, దర్బార్, వకీల్ సాబ్ వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నివేదా థామస్ తన తమ్ముడితో కలిసి తెగ సందడి చేస్తుంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ అభిమానులను కవ్విస్తుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us