పాలు, ఖర్జూర కలిపి తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా?
పాలు ఖర్జూర ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తుంటారు. ముఖ్యంగా పాలలో ఖర్జూర వేసుకొని తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంట. కాగా, పాలతో పాటు ఖర్జూర తినడం వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, దీని వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.
Updated on: Jun 07, 2025 | 6:07 PM

పాలల్లో ఖర్జూర కలిపి తీసుకోవడం వలన శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందంట. పాలల్లో కాల్షియం, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అదే విధంగా ఖర్జూరలో ఐరన్, ఫైూబర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించడానికి దోహదపడుతాయి.

అందువలన పాలల్లో ఖర్జూర కలిపి తీసుకోవడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా, ఆరోగ్యంగా, చాలా యాక్టివ్‌గా ఉంటారంట. ఇక పిల్లలకు పాలల్లో ఖర్జూర కలిపి ఇవ్వడం వలన ఇది వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందంట. అంతే కాకుండా ఎముకలు బలంగా తయారు అయ్యేలా చేస్తుందని చెబుతున్నారు వైద్యులు.

అలాగే పాలతో పాటు ఖర్జూర తీసుకోవడం వలన ఇది శరీరానికి బలాన్ని ఇస్తుందంట. అంతే కాకుండా రక్త హీనత సమస్యతో బాధపడే వారికి ఇది బెస్ట్ మెడిసన్. అంతే కాకుండా వారంలో కనీసం మూడు రోజుల పాటు ఖర్జూరతోపాటు పాలు తీసుకోవడం వలన జీర్ణక్రియ సాఫీగా సాగుతుందంట. ఇది పేగు ఆరోగ్యానికి బెస్ట్ మెడిసన్ అంటున్నారు నిపుణులు.

ఇక ఎవరైతే మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారో, అలాంటి వారు కూడా ఖర్జూర కలిపిన పాలు తీసుకోవాలంట. దీని వలన ఇది ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది శరీరా బలహీనతను తొలిగిస్తుందంట. పాలల్లో ఉండే పోషకాలు చర్మానికి కూడా చాలా మేలు చేస్తాయంట. పాలతో పాటు ఖర్జూర తినడం వలన ఇది చర్మాన్ని నిగారింపుగా తయారు చేస్తుంది.

అలాగే ఎవరైతే బరువు పెరగాలి అనుకుంటున్నారో, వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. పాలల్లో ఖర్జూర కలిపి తీసుకోవడం వలన త్వరగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుందంట. అంతే కాకుండా సీజనల్ వ్యాధుల నుంచి కూడా ఇది కాపాడుతుంది. జుట్టు సంరక్షణకు కూడా తోడ్పడుతుందంట.



















