- Telugu News Photo Gallery Do You Have The Habit Of Using Phone In Toilet, Then you may get these health problems
Mobile In Toilet: టాయిలెట్‌లో మొబైల్ వాడే అలవాటుందా..? మీకు సుస్సు పోయించే న్యూస్.. బీఅలెర్ట్..
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అత్యవసర సాధనంగా మారింది. ఫోన్ లేకుండా ప్రతిదీ కష్టంగా మారుతుంది. మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేం.. అనేట్లుగా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆఫీసు నుంచి మార్కెట్ వరకు చాలా వరకు స్మార్ట్ ఫోన్‌ల ద్వారానే జరుగుతుంది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. ఫోన్‌కి అతుక్కుపోతుంటాం..
Updated on: Apr 11, 2023 | 1:58 PM

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అత్యవసర సాధనంగా మారింది. ఫోన్ లేకుండా ప్రతిదీ కష్టంగా మారుతుంది. మొబైల్ లేని జీవితాన్ని ఊహించలేం.. అనేట్లుగా చాలామంది కనెక్ట్ అయ్యారు. ఆఫీసు నుంచి మార్కెట్ వరకు చాలా వరకు స్మార్ట్ ఫోన్‌ల ద్వారానే జరుగుతుంది. నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు.. ఫోన్‌కి అతుక్కుపోతుంటాం.. గేమ్స్, వీడియోలు, చాటింగ్, సోషల్ మీడియా.. ఇలా చాలా వాటికి కనెక్ట్ అయ్యారు. అందుకే ప్రతిక్షణం ఏం జరుగుతుంది..? అనేదానిపై దృష్టిసారించి.. ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నారు.

కొందరు టాయిలెట్ సీట్‌లో కూర్చుని మొబైల్‌లో గేమ్‌లు ఆడుతూ.. వీడియోలు చూస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి హానికరమంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఇంకా చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. మొబైల్ ను టాయిలెట్ ఉపయోగించడం వల్ల కలిగే పర్యవసానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

టాయిలెట్‌లో మొబైల్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు.. బ్యాక్టీరియా ప్రమాదం : టాయిలెట్‌లో ప్రతిచోటా హానికరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మొబైల్ ఉపయోగిస్తూ టాయిలెట్ లో కూర్చున్నప్పుడు.. అదే చేత్తో మగ్, జెట్ స్ప్రే, టాయిలెట్ కవర్, ఫ్లష్ బటన్‌ను తాకుతారు. దీని కారణంగా, అనేక రకాల హానికరమైన జెర్మ్స్ సెల్‌ఫోన్ స్క్రీన్‌పై పేరుకుపోతాయి. మీరు మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో మొబైల్ ను శుభ్రపరచలేము.

దీనివల్ల మళ్లీ మీరు స్మార్ట్‌ఫోన్‌ను తాకినప్పుడు.. తినే సమయంలో సూక్ష్మక్రిములు మళ్లీ మీ కడుపులోకి ప్రవేశిస్తాయి. అప్పుడు కడుపునొప్పి, మలబద్ధకం, అజీర్ణం, మూత్రనాళ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

డయేరియా: మొబైల్‌ని టాయిలెట్‌కి తీసుకెళ్లడం వల్ల బ్యాక్టీరియాతో కలుషితం అవుతుంది. ఆ తర్వాత తినేటప్పుడు అదే మొబైల్‌ను ఉపయోగించడం వల్ల ఈ బ్యాక్టీరియా మన పేగుల్లోకి చేరి విరేచనాలు వంటి సమస్యలకు కారణం అవుతుంది.

పైల్స్: పైల్స్ సంభవించడానికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ ఇది సాధారణంగా బలహీనమైన వ్యాకోచం కారణంగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో టాయిలెట్‌లో మొబైల్ ఫోన్లు వాడటం వల్ల కూడా ఈ వ్యాధి విజృంభిస్తోంది. మీ మలద్వారం నుంచి రక్తం రావడం మొదలవుతుంది. ఇంకా పురీషనాళంలో చాలా మంటగా ఉంటుంది. ఇది కాకుండా, టాయిలెట్‌లో నిరంతరం కూర్చోవడం వల్ల, తొడ కండరాలపై కూడా చెడు ప్రభావం చూపుతుంది.




