- Telugu News Photo Gallery Do you eat too much pizza, beware of these dangerous diseases, check here is details in Telugu
Pizza Side Effects: పిజ్జా తింటున్నారా.. ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి జాగ్రత్త!
ప్రస్తుతం ఇప్పుడున్న జీవితంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌కి డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ముఖ్యంగా యువత, చిన్న పిల్లలు వీటికి బానిసలు అవుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒకటి స్నాక్ రూపంలో లోపలికి వెళ్తూనే ఉంటుంది. పని ఈజీ అవుతుంది కదా అని పెద్దలు కూడా వీటిని కొని ఇస్తున్నారు. ఇలా వీటినే కడుపు నింపుకుంటున్నారు. ప్రస్తుతం బాగా పాపులర్ అయిన జంక్ ఫుడ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. చీజీగా, టేస్టీగా ఎంతో బావుంటుంది పిజ్జా. సెలబ్రేషన్ ఏదైనా..
Updated on: Feb 01, 2024 | 3:16 PM

ప్రస్తుతం ఇప్పుడున్న జీవితంలో జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్‌ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత, చిన్న పిల్లలు వీటికి బానిసలు అవుతున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక స్నాక్ రూపంలో లోపలికి వెళ్తుంది. పని ఈజీ అవుతుంది కదా అని పెద్దలు కూడా వీటిని కొని ఇస్తున్నారు. ఇలా ఈ జంక్ ఫుడ్‌కి బానిసలుగా మారిపోతున్నారు.

ప్రస్తుతం బాగా పాపులర్ అయిన జంక్ ఫుడ్స్‌లో పిజ్జా కూడా ఒకటి. చీజీగా, టేస్టీగా ఎంతో బావుంటుంది పిజ్జా. సెలబ్రేషన్ ఏదైనా సరే పిజ్జాలు ఖచ్చితంగా ఉంటుంన్నాయి. కేవలం యువత మాత్రమే కాదు. పిల్లలూ, పెద్దలు కూడా ఇష్టపడి మరీ వీటిని తింటున్నారు.

అదే క్రమంలో అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. పిజ్జాను తరుచుగా తినడం వల్ల ఎదురయ్యే సమస్యల్లో డయాబెటీస్ కూడా ఒకటి. పిజ్జా తినడం వల్ల బ్లడ్‌లో షుగర్ స్థాయిలు పెరిగి.. క్రమంగా మధుమేహంగా మారుతుంది.

పిజ్జా తినడం వల్ల ఎదురయ్యే మరో ప్రమాదకర వ్యాధి గుండె పోటు. పిజ్జాల్లో వివిధ రకాల ప్రొసెడ్డ్ ఫుడ్స్ కలిపి ఉండటం వల్ల.. హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. దీంతో హార్ట్ స్ట్రోక్, ఎటాక్ వంటివి వస్తున్నాయి.

అధిక కొవ్వు ప్రాసెస్ చేయబడిన పిజ్జా లాంటి ఆహారం తినడం వల్ల కడుపు, ప్రేగు క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాకుండా విపరీతంగా బరువు పెరిగి పోతున్నారు. దీని వల్ల ఇతర సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి.




