- Telugu News Photo Gallery Do this to keep your hair black even after getting old, Check Here is Details
Black Hair Tips: వయసు పెరిగినా కూడా జుట్టు నల్లగా ఉండాలంటే ఇలా చేయండి..
జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటే.. ఆహా చూడటానికి ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో అనేక కారణాల వల్ల జుట్టు చిన్న వయసులో తెల్లబడి పోతుంది. ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అనేక తంటాలు పడుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం.. వయసు పైనబడుతున్నా జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది. జుట్టుని నల్లగా ఉంచడంలో ఉసిరి ఆయిల్ చక్కగా హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కల్ని నానబెట్టి.. తలకు రాసుకోవాలి. ఈ ఆయిల్ రాత్రి అప్లై చేసి..
Updated on: Sep 09, 2024 | 4:21 PM

జుట్టు నల్లగా నిగనిగలాడుతూ ఉంటే.. ఆహా చూడటానికి ఎంత బాగుంటుంది. కానీ ఇప్పుడున్న కాలంలో అనేక కారణాల వల్ల జుట్టు చిన్న వయసులో తెల్లబడి పోతుంది. ఆ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అనేక తంటాలు పడుతున్నారు. కానీ ఇప్పుడు చెప్పే ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం.. వయసు పైనబడుతున్నా జుట్టు మాత్రం నల్లగా ఉంటుంది.

జుట్టుని నల్లగా ఉంచడంలో ఉసిరి ఆయిల్ చక్కగా హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కల్ని నానబెట్టి.. తలకు రాసుకోవాలి. ఈ ఆయిల్ రాత్రి అప్లై చేసి.. ఉదయం తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు, మూడు సార్లు చేస్తే జుట్టు నల్లబడుతుంది.

జుట్టును నల్లగా ఉంచడంలో కరివేపాకు కూడా హెల్ప్ చేస్తుంది. కొబ్బరి నూనెలో కరివేపాకు వేసి డబుల్ బాయిలింగ్ పద్దతిలో మరిగించాలి. అనంతరం చల్లార్చి జుట్టుకు పట్టించాలి. ఇలా ఒక పూట మొత్తం ఉంచుకుని ఆ తర్వాత హెయిర్ వాష్ చేయాలి.

జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఉల్లి రసం కూడా సహాయ పడుతుంది. ఉల్లిపాయ నుంచి రసం తీసి.. జుట్టుకు ఈ రసాన్ని పట్టించి.. ఓ అరగంట తర్వాత తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు నల్ల బడటమే కాకుండా బలంగా, దృఢంగా తయారవుతుంది. జుట్టు రాలదు.

టీ నీటితో కూడా జుట్టును నల్లగా ఉంటుంది. కొద్దిగా నీటిలో టీ పొడి కలిపి బాగా నీటిని మరిగించాలి. అనంతరం నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడు.. తల మొత్తం పట్టించాలి. ఓ అరగంట తర్వాత షాంపూతో తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల జట్టు నల్లగా మారుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)




