- Telugu News Photo Gallery Do this to get rid of moss in water tanks easily, check here is details in Telugu
Water Tank Clean: వాటర్ ట్యాంకుల్లో నాచు ఈజీగా పోవాలంటే ఇలా చేయండి..
ఈ రోజుల్లో ప్రతీ ఇంటికి కూడా వాటర్ ట్యాంకులు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. నీటిని నిల్వ చేయడానికి ఈ ట్యాంకులు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. అయితే వాటర్ ట్యాంకుల్లో నీళ్లు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల నాచు అనేది బాగా పేరుకుపోతుంది. ఈ నాచు అంత త్వరగా వదిలి పోదు. దీన్ని వదలించడానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటర్ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే నాచు కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు..
Updated on: Jul 23, 2024 | 5:41 PM

ఈ రోజుల్లో ప్రతీ ఇంటికి కూడా వాటర్ ట్యాంకులు అనేవి ఖచ్చితంగా ఉంటున్నాయి. నీటిని నిల్వ చేయడానికి ఈ ట్యాంకులు ఎంతో బాగా ఉపయోగ పడతాయి. అయితే వాటర్ ట్యాంకుల్లో నీళ్లు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉండటం వల్ల నాచు అనేది బాగా పేరుకుపోతుంది.

ఈ నాచు అంత త్వరగా వదిలి పోదు. దీన్ని వదలించడానికి చాలా కష్ట పడాల్సి వస్తుంది. ఇలాంటి వాటర్ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎందుకంటే నాచు కారణంగా నీటిలో బ్యాక్టీరియా, వైరస్‌లు వంటివి పెరిగి పోతాయి.

వాటర్ ట్యాంకులో నాచు సమస్యను తగ్గించడంలో బ్లీచింగ్ చక్కగా పని చేస్తుంది. ముందు ట్యాంకులోని నీటిని ఖాళీ చేసి.. మొత్తం అంతా బ్లీచింగ్ చల్లాలి. ఓ గంట సేపు ఆగిన తర్వాత చీపురు లేదా క్లాత్, స్క్రబ్బర్‌తో రుద్దాలి. ఇలా నెలకు ఒకసారి చేస్తే.. కొత్త ట్యాంకులా మెరిసిపోతుంది.

హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కూడా వాటర్ ట్యాంకును క్లీన్ చేయవచ్చు. ముందుగా ట్యాంకులోని నీటిని అంతా ఖాళీ చేయాలి. ఆ తర్వాత ట్యాంక్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఓ అరగంట సేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత క్లాత్‌తో శుభ్రం తుడిచేయాలి.

హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కూడా వాటర్ ట్యాంకును క్లీన్ చేయవచ్చు. ముందుగా ట్యాంకులోని నీటిని అంతా ఖాళీ చేయాలి. ఆ తర్వాత ట్యాంక్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి ఓ అరగంట సేపు అలానే ఉంచాలి. ఆ తర్వాత క్లాత్‌తో శుభ్రం తుడిచేయాలి.




