- Telugu News Photo Gallery If you try these tips, even the cockroaches hiding in the corners will come out, check here is details
Kitchen Hacks: ఈ టిప్స్ ట్రై చేశారంటే మూలల్లో దాగివున్న బొద్దింకలు కూడా బయటకు పోతాయి!
సీజన్ ఏదైనా సరే ఇంట్లో బొద్దింకల బెడద ఉండటం చాలా కామన్. ఈ బొద్దింకలు ఎక్కువగా కిచెన్‌లోనే ఉంటాయి. వండిన పాత్రలపై, ఆహారంపై చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఆహారం తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి బొద్దింకల్ని ఇంట్లోంచి తరిమేయాలి. వీటిని బయటకు పంపించేందుకు ఇప్పుడు చెప్పే చిట్కాలు ఎంతో చక్కగా పని చేస్తాయి. బిర్యానీ ఆకుల్ని మెత్తగా పొడిలా చేసి, అందులో కర్పూరం వేసి..
Updated on: Jul 23, 2024 | 6:41 PM

సీజన్ ఏదైనా సరే ఇంట్లో బొద్దింకల బెడద ఉండటం చాలా కామన్. ఈ బొద్దింకలు ఎక్కువగా కిచెన్‌లోనే ఉంటాయి. వండిన పాత్రలపై, ఆహారంపై చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆ ఆహారం తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాలు, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.

Cockroaches

బోరిక్ పౌడర్ నుంచి కూడా ఒక లాంటి ఘాటు స్మెల్ వస్తుంది. దీన్ని పిండిలా చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని బొద్దింకలు ఎక్కువగా తిరిగే చోట పెట్టండి. తక్కువ సమయంలోనే బొద్దింకలు ఇంట్లోంచి వెళ్లిపోతాయి.

బేకింగ్ సోడాతో కూడా బొద్దింకల్ని తగ్గించుకోవచ్చు. కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్ మిక్స్ చేసి బొద్దింకలు ఎక్కువగా తిరిగే మూల మూలల్లో కొట్టండి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు బయటకు పోతాయి.

బొద్దింకల్ని తరిమి కొట్టడంలో ఈ చిట్కా కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. వేపాకులను పేస్టులా చేసి ఉండలుగా చేసి మూలల్లో పెట్టండి. వీటి వాసనకు బొద్దింకలు బయటకు పోతాయి.




