- Telugu News Photo Gallery Diwali Water Lamps: How to light lamps with water, Know Easy lighting method, step by step
Diwali Water Lamps: అబద్దం అనుకునేరు.. ఇదే నిజం.. నీటితో కూడా దీపాలు వెలిగించవచ్చు.. ఎలానో తెలుసా?
Water deepa ideas:మనం సంతోషంగా జరుపుకునే పండుగల్లో దీపావళి కూడా ఒకటి. దివాళి వచ్చిందంటే చాలు ప్రతి ఇళ్లు కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. ప్రతి ఇంటి ముందు మిరిమిట్లుగొలిపే కాంతులతో దీపాలు దర్శనమిస్తాయి.ఈ దివాళి పండగకు దీపాలే ప్రత్యేకం. అయితే సాధారణంగా దీపాలను నూనెతో వెలిగిస్తామని అందరికీ తెలుసు కానీ నీటితో కూడా వాటిని వెలిగించవచ్చని ఎంతమందికి తెలుసు.. మీకు దీని గురించి తెలియకపోతే తెలుసుకుందాం పదండి.
Updated on: Oct 20, 2025 | 1:49 PM

దీపావళి అంటే అందరికి గుర్తొచ్చేది, టపాసులు, దీపాలు,స్వీట్లు. ఈ పండగకు ప్రతి ఇంట్లో మీకు దీపాలు దర్శనమిస్తాయి. ఆ దీపాల కాంతుల్లో ఇళ్లంతా వెలిగిపోతూ కనిపిస్తుంది. అయితే ఈ దీపాలు వెలిగించాలంటే నూనె అవసరం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నూనెతో దీపాలు వెలిగించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని.

కాబట్టి నూనెతో కాకుండా నీటితో దీపాలు ఎలా వెలింగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్కెట్లో లభించే సెన్సార్ దీపాలకు బదులుగా,మట్టి కుండలపై నీరు పోసి కూడా దీపాలను వెలిగించవచ్చు

నీటితో పాలు వెలిగించేందుకు మీరు ముందుగా ఒక కొత్త ప్రమిదలను కొనండి తర్వాత వాటిని కొద్ది సేపు నీటిలో నానబెట్టి ఆరబెట్టండి. తర్వాత కొద్దిగా పత్తిని తీసుకొని దానితో వత్తులు చేయండి. మీరు వత్తులు చేసేప్పుడు మీ చేతికి కొంచెం పాలు, లేదా నిటిని అంటించుకోండి ఇలా చేయడం ద్వారా వత్తులు కరెక్ట్‌గా చేయవచ్చు

ఒత్తులను కొద్దిగా మందంగా చేయండి. వత్తులు మందంగా ఉండే అవి ఎక్కువ సేపు మండడానికి సహాయపడుతాయి. మీ ఒత్తులు చేయడం పూర్తైన తర్వాత ప్రమిదలతో 80శాతం వరకు నీటిని పోయండి తర్వాత అందులో ఒక స్పూన్ ఆయిల్‌ను పోయండి.తర్వాత వత్తులను కొద్దిగా అయిల్‌లో నాబెట్టి వాటిని నీటిపై ఉంచి వెలిగించండి

నీటితో వెలిగించిన దీపాలు కూడా ఎక్కువు సేపు వెలుగుతూ ఉంటాయి.ఇలా చేస్తే నల్ల మరకలు కూడా పడకుండా ఉంటాయి. ఈ ట్రిక్ ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది. దీని వల్ల మీ డబ్బు కూడా సేవ్ అవుతుంది.




