- Telugu News Photo Gallery Diabetes Drinks: Drink These 5 Ayurvedic Juices To Control Diabetes Naturally
Diabetes Drinks: డయాబెటిస్ రోగులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే.. చక్కెర స్థాయిలు అదుపులోనే!
కేవలం చక్కెర తిన్నంత మాత్రాన మధుమేహం వస్తుందనేది అపోష మాత్రమే. ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా షుగర్ లెవెల్ పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఫాస్ట్‌ఫుడ్‌ను తినే అలవాటు కూడా ప్రమాదమే. మీకు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే, మందులు లేకుండా జీవన గడపడం అసాధ్యం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. అందుకు నిత్యం మందులు వేసుకున్నా రోగం తగ్గదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో..
Updated on: Jun 02, 2024 | 8:37 PM

కేవలం చక్కెర తిన్నంత మాత్రాన మధుమేహం వస్తుందనేది అపోష మాత్రమే. ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు కూడా షుగర్ లెవెల్ పెరగడానికి కారణమవుతాయి. అలాగే ఫాస్ట్‌ఫుడ్‌ను తినే అలవాటు కూడా ప్రమాదమే. మీకు మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ అయితే, మందులు లేకుండా జీవన గడపడం అసాధ్యం. మధుమేహం దీర్ఘకాలిక వ్యాధి. అందుకు నిత్యం మందులు వేసుకున్నా రోగం తగ్గదు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మాత్రమే మందులు సహాయపడతాయి.

అందువల్ల డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు మందులపై ఆధారపడకూడదు. ఏమి తినాలి. ఏమి త్రాగాలి అనే దానిపై కూడా అవగాహన కలిగి ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడానికి ఈ కింది 5 డ్రింక్స్ ఉపయోగపడతాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే శక్తి మెంతి గింజలకు ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం.. మెంతుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో అధిక చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతిగింజలు నానబెట్టిన నీటిని త్రాగాలి. కాకరకాయ రసం మలబద్ధకం చికిత్సలో గొప్పగా పనిచేస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరించడానికి కాకరకాయలో కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకరకాయ రసాన్ని తాగితే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

మీకు ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటే దాల్చిన చెక్క టీ తాగండి. టీ ఆకులతోపాటు దాల్చిన చెక్కను నీటిలో మరిగించి కాచిన టీ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దాల్చిన చెక్క ఇన్సులిన్ హార్మోన్ పనితీరును పెంచుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థలో కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నతను మందగింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.

వేడి పాలలో చిటికెడు పసుపు కలిపి నిద్రపోయే ముందు తాగాలి. పసుపు పాలు మధుమేహ వ్యాధిగ్రస్తుల శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఉసిరికాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇన్ఫెక్షన్లు కూడా రాకుండా ఉంటాయి. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఉసిరిలో క్రోమియం ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్ల జీవక్రియలో సహాయపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.




