- Telugu News Photo Gallery Dark Circles Home Remedies Try these five homemade or DIY face mask to remove dark circles in skin care routine in Telugu
Dark Circles: డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నారా..? ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే అందంతోపాటు.. బోలెడన్ని ప్రయోజనాలు
Dark Circles Home Remedies: ఒత్తిడి, కాలుష్యం, ఆహారం, జీవనశైలి ప్రభావం చర్మంపై తీవ్రంగా కనిపిస్తుంది. అనేక సమస్యలు చర్మంపై కనిపించడంతోపాటు సమస్యగా మారుతాయి. వాటిలో ఒకటి కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles) ఒకటి. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణం సరిగ్గా నిద్రపోకపోవడమేనని అధ్యయనం తేలింది. వాటిని తొలగించేందుకు 5 హోమ్‌మేడ్ ఫేస్ మాస్క్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..
Updated on: Mar 06, 2022 | 1:27 PM

కళ్ల కింద నల్లటి వలయాలు తొలగించేందుకు 5 హోమ్‌మేడ్ ఫేస్ మాస్క్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయి. అవేంటో చూద్దాం..

అలోవెరా జెల్: చర్మ సంరక్షణ విషయానికి వస్తే.. అలోవెరా జెల్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ తీసుకుని దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను కళ్ల కింద అప్లై చేసి కొన్ని నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లోనే తేడా వస్తుంది.

కాఫీ: దీనిలో అనేక లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కాఫీ పొడి తీసుకుని అందులో రెండు చెంచాల కొబ్బరి నూనె కలపాలి. ఈ మాస్క్‌ను సుమారు 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

కీరదోస: అలసట వల్ల నల్లటి వలయాలు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతాన్ని ఫ్రెష్‌గా ఉంచడానికి కీర దోసకాయ సహాయం తీసుకోవచ్చు. ఇందుకోసం దోసకాయ రసం తీసి కళ్ల కింద అప్లై చేయాలి. ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేస్తే ఫలితం ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్: ఇందులో ఉండే విటమిన్ సి కొద్ది రోజుల్లోనే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలను తొలగిస్తుంది. దీని కోసం ఆరెంజ్ జ్యూస్ తీసి అందులో దూదిని నానబెట్టాలి. ఆ తర్వాత కంటి కింద నల్లగా ఉన్న ప్రదేశంలో సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయండి.

బంగాళదుంప రసం: చర్మ సంబంధిత రుగ్మతలను తొలగించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బంగాళాదుంప రసాన్ని తీసి కాటన్ సహాయంతో కళ్ల కింద భాగంలో అప్లై చేయాలి. ఇది ఒక రకమైన ఫేసియల్ మాస్క్. దీంతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కావాలంటే బంగాళాదుంప రసాన్ని ముఖమంతా రాసుకుంటే చర్మంపై ఉన్న టానింగ్ తొలగిపోతుంది.





























