- Telugu News Photo Gallery Cucumber capsicum okra gourd price price hike in telugu states know the latest rate of vegetable market
Vegetable Price Hike: సామాన్యుడి జేబుకి చిల్లు.. బంగాళాదుంప మినహా కొండెక్కిన కూరగాయల ధరలు..
కూరగాయల ధరలు ఉంటె అతి తక్కువగా ఉండి.. అన్నదాత కంట కన్నీరు పెట్టిస్తే.. ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతూ సామాన్యుడి జేబులకు చిల్లులు పెడతాయి. గత కొన్ని రోజుల క్రితం ధర లేక రోడ్డుమీద పోసిన టమాటాలు నేడు కటకటలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుతుపవనాల ప్రారంభంతో ద్రవ్యోల్బణం రాకెట్‌లా దూసుకుపోతోంది. టమోటా తర్వాత, ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం సహా అన్ని ఆకుపచ్చ కూరగాయలు ధర రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయి.
Updated on: Jul 14, 2023 | 12:45 PM

టమోటా తర్వాత, ఇప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం సహా అన్ని ఆకుపచ్చ కూరగాయలు ధర రెట్టింపు కంటే ఎక్కువ అయ్యాయి. అన్ని రకాల కూరగాయలతో పాటు.. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి సహా అనేక వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యులు ఏమి కొనేటట్లు లేదు.. ఏమి తినేటట్లు లేదంటూ వాపోతున్నారు.

గత కొన్ని రోజుల క్రితం వరకూ కిలో రూ.30 నుంచి 40కి లభించే కూరగాయలు ఇప్పుడు రూ.100 దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు కూరగాయలను కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంకా చెప్పాలంటే ధరలు పెరగడంతో చాలా మంది కూరగాయలను కొనడం కోసం మండీలకు వెళ్లడం మానేశారు. తమకు అందుబాటులో ఉన్న బంగాళదుంపలు, సోయాబీన్స్, శనగపప్పుతో చేసిన కూరగాయలు తిని కడుపు నింపుకుంటున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో టమాట ధర కిలో రూ.200కి పైగా పెరిగింది. అల్లం ఘాటెక్కింది.. కిలో రూ.320 అయింది. వెల్లుల్లి కూడా కిలో రెండు వందలకు పైగా ఉంది. ఈ ధరలతో అన్నదాత హర్షం వ్యక్తం చేస్తుంటే.. సామాన్యుడు లబోదిబోమంటున్నారు

అనేక కూరగాయల మార్కెట్‌లో టమాటా మినహా ఇతర కూరగాయల ధరలు రెండింతలు పెరిగాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్ లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. టమాటా రూ.220, క్యాప్సికం కిలో రూ.100 నుంచి 110 వరకు విక్రయిస్తున్నారు. కొత్తిమీరదీ అదే పరిస్థితి. రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయించే కొత్తిమీర ధర రూ.100కి చేరింది.

అదేవిధంగా కాకరకాయ ధర కూడా నిప్పులు కక్కింది. నెల రోజుల క్రితం వరకు కిలో రూ.20 ఉన్న కాకరకాయ ఇప్పుడు రూ.60 లకు చేరుకుంది. అదేవిధంగా బెండకాయ కిలో రూ.50కి చేరింది. విశేషమేమిటంటే కాలీఫ్లవర్ ధర మూడు రెట్లు పెరిగింది. 30 నుంచి 35 రోజుల క్రితం వరకు క్యాలీఫ్లవర్ కిలో రూ.40 ఉండేది. ఇప్పుడు దాని ధర కిలో రూ.120కి చేరింది. అదేవిధంగా నిమ్మకాయ కిలో రూ.80, పచ్చిమిర్చి కిలో రూ.100లు చేరుకుంది.





























