AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 5 భారత బౌలర్లలో సచిన్‌ ఉన్నాడని మీకు తెలుసా?

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 బుధవారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే అన్ని టీమ్స్‌ కూడా ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. బ్యాటర్ల బౌలర్ల మధ్య జరిగే ఈ సమరంలో కొన్ని సార్లు బ్యాటర్లు, మరికొన్ని సార్లు బౌలర్లు పైచేయి సాధించారు. అయితే గతంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్‌ 5 భారత బౌలర్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ఓ షాకింగ్‌ ట్విస్ట్‌ ఏంటంటే.. దిగ్గజ బ్యాటర్‌గా పేరొందిన సచిన్‌ టెండూల్కర్‌ టాప్‌ 3లో ఉన్నారు. మరి ఆయన ఎన్ని వికెట్లు తీశారు. టాప్‌ 5లో మిగతా నలుగురు ఎవరో ఇప్పుడు చూద్దాం..

SN Pasha
|

Updated on: Feb 17, 2025 | 12:20 PM

Share
ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న భారత బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో ఇషాంత్‌ శర్మ ఉన్నాడు. ఇషాంత్‌ 2009 నుంచి 2013 మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో ఆడాడు. మొత్తం 7 మ్యాచ్‌లు ఆడి  23.84 యావరేజ్‌తో 13 వికెట్లు సాధించాడు. ఎకానమీ 5.79గా ఉంది. బెస్ట్‌ బౌలింగ్‌ స్టాట్స్‌ వచ్చిసి 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు.

1 / 5
ఇక నాలుగో స్థానంలో స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఉన్నాడు. 2002 నుంచి 2009 వరకు జగిరిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో 13 మ్యాచ్‌లు ఆడిన భజ్జీ 35.42 యావరేజ్‌తో 14 వికెట్లు తీసుకున్నాడు. ఎకానమీ 3.96గా ఉంది. బెస్ట్‌ బౌలింగ్‌ స్టాట్స్‌ చూస్తే 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు సాధించాడు.

2 / 5
ఇక మూడో స్థానంలో ఉండే పేరు చూసి కచ్చితంగా చాలా మంది షాక్‌ అవుతారు. ఎందుకంటే.. టాప్‌ 5 బౌలర్లలో టాప్‌ 3లో ఓ దిగ్గజ బ్యాటర్‌ ఉన్నారు. ఆయనే ది లెజెండ్‌ సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌. సచిన్‌ బ్యాటింగ్‌తో పాటు పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా కూడా ఎన్నో వికెట్లు సాధించారు. వన్డేల్లో ఆయనకు వందకు పైగా వికెట్లు ఉన్నాయి. అయితే 1998 నుంచి 2009 మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో భాగంగా 16 మ్యాచ్‌లు ఆడిన సచిన్‌ ఏకంగా 14 వికెట్లు సాధించారు. ఎకానమీ 4.73గా ఉంది.  ఓసారి 4 వికెట్ల హాల్‌ కూడా సాధించారు. బెస్ట్‌ బౌలింగ్‌ స్టాట్స్‌ చూసుకుంటే 38 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు.

3 / 5
ఇక రెండో స్థానంలో టీమిండియా దిగ్గజ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ ఉన్నాడు. జహీర్‌ 2000 నుంచి 2002 మధ్య జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో పాల్గొని 9 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 24.53 యావరేజ్‌తో 15 వికెట్లు సాధించాడు. ఎకానమీ 4.60గా ఉంది. ఒక సారి 4 వికెట్ల హాల్‌ సాధించాడు. బెస్ట్‌ బౌలింగ్‌ స్టాట్స్‌ వచ్చేసి 45 పరుగులు ఇచ్చి 4 వికెట్లు సాధించాడు.

4 / 5
ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో స్టార్‌ ఆల్‌రౌండర్‌  రవీంద్ర జడేజా ఫస్ట్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 2013  నుంచి 2017 మధ్య కాలంలో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో ఆడిన జడేజా 10 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు సాధించాడు. అతని ఎకానమీ 4.85గా ఉంది. ఓ మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్‌ కూడా సాధించాడు. బెస్ట్‌ బౌలింగ్‌ స్టాట్స్‌ వచ్చేసి 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు.

5 / 5