- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: Team India Most Times Reaching ICC Finals after Australia
ICC Finals: ఇంగ్లండ్‌పై విక్టరీతో ఆస్ట్రేలియాకు ఇచ్చి పడేసిన రోహిత్ సేన.. కట్‌చేస్తే.. భారత్ ఖాతాలో ప్రపంచ రికార్డ్
T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో రేపు (జూన్ 29న) ఫైనల్ మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్రపంచకప్‌ను గెలుచుకోవాలని టీమిండియా ఎదురుచూస్తోంది.
Updated on: Jun 28, 2024 | 10:20 AM

ఐసీసీ టోర్నీల్లో అత్యధిక ఫైనల్స్ ఆడిన రికార్డు ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉంది. ఐసీసీ టోర్నీల్లో ఆసీస్ మొత్తం 13 సార్లు ఫైనల్స్ ఆడింది. ఇప్పుడు ఈ రికార్డును సమం చేయడంలో టీమిండియా విజయం సాధించింది.

వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్, టీ20 ప్రపంచకప్‌లలో 12 సార్లు ఫైనల్స్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు 13వ సారి టైటిల్ రౌండ్‌లోకి ప్రవేశించింది. దీంతో 13 సార్లు ఐసీసీ ఫైనల్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు రికార్డును టీమిండియా సమం చేసింది.

వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్, టీ20 ప్రపంచకప్‌లలో 12 సార్లు ఫైనల్స్ ఆడిన టీమిండియా.. ఇప్పుడు 13వ సారి టైటిల్ రౌండ్‌లోకి ప్రవేశించింది. దీంతో 13 సార్లు ఐసీసీ ఫైనల్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు రికార్డును టీమిండియా సమం చేసింది.

గతంలో జరిగిన 12 ఐసీసీ ఫైనల్స్‌లో భారత జట్టు కేవలం 5 సార్లు మాత్రమే టైటిల్‌ను గెలుచుకుంది. ఇది 1983, 2011లో ODI ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2007లో T20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. 2002, 2013లో టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

13వ సారి ఫైనల్లోకి అడుగుపెట్టిన టీమ్ ఇండియా.. 6వ సారి టైటిల్ కైవసం చేసుకుంటుందనే విశ్వాసంతో ఉంది. కాగా, జూన్ 29న జరగనున్న టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి టీమిండియా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి.





























