- Telugu News Photo Gallery Cricket photos T20 World Cup 2024: India Captain Rohit Sharma Breaks Chris Gayle's Six Record in ICC Knout
Rohit Sharma: గేల్ రికార్డ్‌ను మడతెట్టేసిన రోహిత్.. ఐసీసీ నాకౌట్‌లో తొలి ప్లేయర్‌గా భారత సారథి..
Rohit Sharma Records: టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు గొప్ప రికార్డులను లిఖించాడు. ఈ రికార్డులతో క్రిస్ గేల్, మహేల జయవర్ధనే ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. రోహిత్ శర్మ లిఖించిన కొత్త రికార్డుల జాబితా ఎలా ఉందో ఓసారి చూద్దాం..
Updated on: Jun 28, 2024 | 11:24 AM

Rohit Sharma Records: టీ20 ప్రపంచకప్ 2వ సెమీఫైనల్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనను ప్రదర్శించి ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన హిట్‌మ్యాన్ 39 బంతుల్లో 2 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 57 పరుగులు చేశాడు.

ఈ రెండు సిక్సర్లతో రోహిత్ శర్మ ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డు హోల్డర్‌గా నిలిచాడు. గతంలో ఈ రికార్డు యూనివర్స్ బాస్ ఫేమ్ క్రిస్ గేల్ పేరిట ఉండేది.

వెస్టిండీస్ తరపున టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన క్రిస్ గేల్ మొత్తం 21 సిక్సర్లు కొట్టి ఈ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ ప్రపంచ రికార్డును హిట్‌మ్యాన్ బ్రేక్ చేసేశాడు.

టీమ్ ఇండియా తరపున టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 22 సిక్సర్లు బాదాడు. దీంతో ఐసీసీ నాకౌట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

దీంతో పాటు టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక ఫోర్లు బాదిన ప్రపంచ రికార్డు కూడా రోహిత్ శర్మ పేరిటే చేరింది. గతంలో ఈ రికార్డు శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే పేరిట ఉండేది. జయవర్ధనే మొత్తం 111 ఫోర్లు బాదితే.. ఇప్పుడు రోహిత్ శర్మ 113 ఫోర్లు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

అలాగే టీ20 ప్రపంచకప్‌లో 50 సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ జాబితాలో 31 ఇన్నింగ్స్‌ల్లో 63 సిక్సర్లు బాదిన క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉండగా, ప్రస్తుతం రోహిత్ శర్మ 43 ఇన్నింగ్స్‌ల్లో 50 సిక్సర్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు.




