- Telugu News Photo gallery Cricket photos Sunil Gavaskar commented on Virat Kohli that he can get to 100 centuries like Sachin
Virat Kohli: ‘అతను 100 సెంచరీలు సాధించగలడు, కానీ’.. కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సునీల్ గవాస్కర్..
ప్రపంచ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడని టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్.
Updated on: Jan 17, 2023 | 9:24 AM

ప్రపంచ క్రికెట్ చరిత్రలో 100 సెంచరీలు చేసిన రికార్డ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పేరిట ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టగలడని టీమిండియా మాజీ క్రికెటర్ సునిల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.

విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 74 సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాడానికి కోహ్లీకి ఇంకా 27 సెంచరీలు మాత్రమే కావాలి.

గతంలో ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. భారత ఓపెనర్‌గా సచిన్ టెండూల్కర్ మొత్తం 19 సెంచరీలు సాధించాడు.

ఇప్పటికే 74వ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇంకా 27 సెంచరీలు కావాలి. అయితే 34 ఏళ్ల కోహ్లీ మరికొన్నాళ్లు క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురిపించడం అయితే ఖాయం. తద్వారా సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడని సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.

అయితే సచిన్ పేరిట ఉన్న 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడానికి కోహ్లీ మరో 5 సంవత్సరాలు అయినా క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సచిన్ లాగా విరాట్ కూడా 40 ఏళ్లు వచ్చేవరకూ క్రికెట్ ఆడితే తప్పకుండా 100 సెంచరీలను సాధిస్తాడని సునీల్ గవాస్కర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

4. విరాట్ కోహ్లీ: ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. భారత్‌లో ఆడిన వన్డేల్లో మొత్తం 66 సిక్సర్లు బాదిన కింగ్ కోహ్లీ నాల్గో స్థానంలో నిలిచాడు.

సచిన్ టెండూల్కర్ 40 ఏళ్ల వరకు ఆడాడు. అతను తన ఫిట్‌నెస్‌ను కాపాడుకున్నాడు. విరాట్ కోహ్లీకి కూడా తన ఫిట్‌నెస్ గురించి తెలుసు. వికెట్స్ మధ్య అతను తీసే పరుగులు ఇప్పటికీ అత్యద్భుతంగా ఉంటాయి. ఇదే ఫిట్‌నెస్‌ను కొనసాగించి కోహ్లీ 5, 6 ఏళ్ల పాటు ఆడితే తన బ్యాట్‌తో 27 సెంచరీలు సాధిస్తాడనడంలో సందేహం లేదని సునీల్ గవాస్కర్ అన్నారు.





























