- Telugu News Photo Gallery Cricket photos Pakistan Captain Babar Azam Equals Team India player Virat Kohli's T20 Record
T20 World Cup 2024: కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్.. ప్రపంచ క్రికెట్‌లో కొత్త చరిత్ర..
T20 World Cup 2024: ఈసారి T20 ప్రపంచ కప్ జూన్ 2 నుంచి ప్రారంభమవుతుంది. వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ టోర్నీలో తొలి వారంలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. జూన్ 9న న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు.
Updated on: Jun 01, 2024 | 12:57 PM

T20 World Cup 2024: లండన్‌లోని కెన్నింగ్‌టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 4వ టీ20 మ్యాచ్‌లో బాబర్ అజామ్ 22 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఈ 36 పరుగులతో పాక్ జట్టు కెప్టెన్ టీ20 క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించాడు.

ఈ మ్యాచ్‌లో 36 పరుగులతో టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై కింగ్ కోహ్లీ 639 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు ఈ జాబితాలో బాబర్ అజామ్ 641 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో రెండంకెల స్కోరు చేయడం ద్వారా T20 క్రికెట్‌లో 4000 పరుగులు చేసిన ప్రపంచంలో 2వ బ్యాట్స్‌మెన్‌గా కూడా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది.

కేవలం 107 టీ20 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించగా, బాబర్ అజామ్ ఈ రికార్డును లిఖించడానికి 112 ఇన్నింగ్స్‌లు తీసుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్‌లో 4 వేలకు పైగా పరుగులు చేసిన ప్రపంచంలో రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా బాబర్ అజామ్ రికార్డు సృష్టించాడు. పాకిస్థాన్ తరపున 81 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా బ్యాటింగ్ చేసిన బాబర్ మొత్తం 2520 పరుగులు చేశాడు. దీని ద్వారా టీ20 క్రికెట్‌లో 2500+ పరుగులు చేసిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు.

ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.5 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. ఈ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్ల తేడాతో ఛేదించింది. అలాగే, సిరీస్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ఇది టీ20 ప్రపంచకప్‌పై ఏమాత్రం ఎఫెక్ట్ చూపిస్తుందో చూడాలి.




