MS Dhoni: చెన్నై శిబిరంలో చేరిన సీఎస్‌కే సారథి ఎంఎస్ ధోని.. వైరలవుతోన్న ఫోటోలు..
CSK: IPL 2024 మొదటి దశ షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి, చాలా జట్లు తమ శిక్షణా శిబిరాలను ప్రారంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పేరు కూడా ఇందులో ఉంది. కాగా, మంగళవారం ఎంఎస్ ధోనీ కూడా తన జట్టుతో చేరాడు. CSK శిక్షణా శిబిరం ప్రారంభానికి ముందే ధోని రాబోయే సీజన్ కోసం తన సన్నాహాలను ప్రారంభించాడు.
Updated on: Mar 05, 2024 | 10:06 PM

IPL 2024 మొదటి దశ షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి, చాలా జట్లు తమ శిక్షణా శిబిరాలను ప్రారంభించాయి. ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పేరు కూడా ఇందులో ఉంది. కాగా, మంగళవారం ఎంఎస్ ధోనీ కూడా తన జట్టుతో చేరాడు. CSK శిక్షణా శిబిరం ప్రారంభానికి ముందే ధోని రాబోయే సీజన్ కోసం తన సన్నాహాలను ప్రారంభించాడు. అతడి ప్రాక్టీస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు జట్టులోని మిగతా వారితో కలిసి శిక్షణ తీసుకుంటూనే.. 17వ సీజన్ కోసం కూడా తన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటాడు.

మంగళవారం, CSK తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శిబిరానికి వచ్చిన తర్వాత ధోని చిత్రాలను పంచుకుంది. ఈ చిత్రాలలో, ధోనీ ఎరుపు టీ-షర్ట్, గోధుమ రంగు ప్యాంటు ధరించి కారు నుంచి బయటకు వచ్చి హోటల్‌కు చేరుకున్న తర్వాత 'లియో'కి హాయ్ చెప్పినట్లు చూడొచ్చు.

42 ఏళ్ల ధోని ఇటీవల జామ్‌నగర్‌లో నిర్వహించిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో తన భార్య సాక్షితో కనిపించడం గమనార్హం. అక్కడ అతను కూడా చాలా ఎంజాయ్ చేశాడు.

IPL 2023లో, CSK ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి తన ఐదవ టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, రాబోయే సీజన్‌లో ధోనీ జట్టులో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనే విషయంపై మాత్రం చెప్పలేం. సోమవారం, ధోని తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పంచుకున్నాడు. దీని ఇలా తన అభిమానులను డైలమాలో పడేశాడు. కొత్త సీజన్, కొత్త పాత్ర కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాశాడు.

మార్చి 22న చెపాక్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 2024లో చెన్నై తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. ధోనీని మరోసారి చూడాలని అభిమానులు ఇప్పటికే చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.




