- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Telangana Player Tilak Varma Scores His Third Fifty but mumbai indians lost all matches in ipl
Mumbai Indians: 6 అర్థ శతకాలు.. 6సార్లు ఓడిన ముంబై ఇండియన్స్.. ఐరన్ లెగ్ హాఫ్ సెంచరీలంటూ తెలుగబ్బాయిపై ట్రోల్స్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన 43వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 257 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన ముంబై ఇండియన్స్ జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు.. 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
Updated on: Apr 28, 2024 | 1:39 PM

ముంబై ఇండియన్స్ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మ ఐపీఎల్‌లో ఆరో అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఇన్ని మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఒక్కసారి కూడా గెలవకపోవడం ఆశ్చర్యకరం. అంటే తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసిన అన్ని మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓడిపోయింది.

తిలక్ వర్మ 2022, 2023లో మొత్తం మూడు అర్ధసెంచరీలు చేశాడు. ఈ మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఈ ఐపీఎల్‌లో మూడు అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. ఇన్ని మ్యాచ్‌ల్లోనూ హార్దిక్ పాండ్యా జట్టు తడబడింది.

ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై తిలక్ వర్మ 64 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ 65 పరుగులు చేసినా ముంబై జట్టు 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు చేసినప్పటికీ ముంబై ఇండియన్స్ జట్టు గెలవలేకపోయింది. దీనికి తోడు తిలక్ వర్మ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తే.. ముంబై ఇండియన్స్ ఓడిపోయింది అనే మాటలు వినపడటం మొదలుపెట్టాయి.

ఈ వాదనలు ఎలా ఉన్నప్పటికీ, ఐపీఎల్‌లో మంచి ప్రదర్శనను కొనసాగిస్తున్న తిలక్ వర్మ 9 ఇన్నింగ్స్‌లలో మొత్తం 336 పరుగులు చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు పోరాటాలకు తనవంతు సహకారం అందించాడు.




