- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Strongest Playing 11 For MS Dhoni's Chennai Super Kings, Details Here
CSK: ఊహకందని విధ్వంసం.. ఈ 11 ఆటగాళ్లతో ధోని జట్టు బరిలోకి దిగితే కప్పు గెలవడం చాలా ఈజీ.!
12 ప్లే-ఆఫ్స్, 10 ఫైనల్స్.. 5 ఐపీఎల్ ట్రోఫీలు.. ధోని సారధ్యంలోని సీఎస్‌కే ట్రాక్ రికార్డు ఇది. సీనియర్ల జట్టని పేరున్నప్పటికీ.. మిస్టర్ కూల్ ధోని తన పదునైన ప్రణాళికలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీంగా మార్చాడు. ఇదిలా ఉంటే.. మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 జరగనుంది. మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతుంది.
Updated on: Mar 18, 2024 | 11:45 AM

12 ప్లే-ఆఫ్స్, 10 ఫైనల్స్.. 5 ఐపీఎల్ ట్రోఫీలు.. ధోని సారధ్యంలోని సీఎస్‌కే ట్రాక్ రికార్డు ఇది. సీనియర్ల జట్టని పేరున్నప్పటికీ.. మిస్టర్ కూల్ ధోని తన పదునైన ప్రణాళికలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఐపీఎల్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ టీంగా మార్చాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తన తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడనుంది. మరి ఏయే ఆటగాళ్లతో సీఎస్‌కే బరిలోకి దిగుతుందో చూసేద్దాం..

గత సీజన్‌లో జట్టు విజయాల్లో కీలక పాత్రలు పోషించిన ఓపెనర్ డెవాన్ కాన్వే, యువ ఫాస్ట్ బౌలర్ మతీషా పతిరానా గాయాల కారణంగా కనీసం మొదటి మూడు లేదా నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరు.

ఐపీఎల్ 2023లో చెన్నై మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి కాన్వే.. చక్కటి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అలాగే వ్యక్తిగతంగానూ దాదాపు 600 పరుగులు చేసి జట్టుకు ఉపయోగాపడ్డాడు. ఇక ఇప్పుడు అతడి స్థానంలో అజింక్యా రహనే చెన్నై ఓపెనర్‌గా బరిలోకి దిగవచ్చు. ఇక వన్‌డౌన్‌లో న్యూజిలాండ్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర ఆడతాడు.

ఇక పతిరానా చెన్నైకి డెత్ ఓవర్ల స్పెషలిస్ట్. 'మలింగ' టైప్ స్వింగ్ బౌలింగ్‌తో ప్రత్యర్ధులను ముప్పుతిప్పలు పెడతాడు. ఈసారి అతడి స్థానాన్ని బంగ్లాదేశ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ భర్తీ చేయనున్నాడు. అటు మహిష్ తీక్షణ స్పిన్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు.

చెన్నై ప్లేయింగ్-11(అంచనా): ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, రచిన్ రవీంద్ర, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహిష్ తీక్షణ, దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహ్మాన్.




