- Telugu News Photo Gallery Cricket photos RCBW won 1st wpl title aginst dcw check here Awards Full List in telugu Shreyanka Patil Deepthi Sharma
WPL 2024 Awards List: విన్నర్, రన్నర్‌లకు ఎంత ప్రైజ్ మనీ వచ్చిందో తెలుసా? అవార్డుల పూర్తి జాబితా ఇదే..
WPL 2024 Awards Full List: మహిళల ప్రీమియర్ లీగ్ 2వ ఎడిషన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్‌గా నిలిచింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
Updated on: Mar 18, 2024 | 11:32 AM

WPL 2024 Awards Full List: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2024) సీజన్-2 ముగిసింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBW) జట్టు ఢిల్లీ క్యాపిటల్స్(DCW)ను ఓడించింది. ఈ ఛాంపియన్ టైటిల్‌తో పాటు ఆర్‌సీబీ ఆటగాళ్లు ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్నారు. ఆ అవార్డుల పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎమర్జింగ్ ప్లేయర్: ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు ఆర్సీబీ ప్లేయర్ శ్రేయాంక పాటిల్‌కు దక్కింది. ఈ అవార్డుతో 5 లక్షల విలువ చేసే బ్యాంగిల్స్ ప్రైజ్ మనీగా అందుకుంది.

ఆరెంజ్ క్యాప్: మహిళల ప్రీమియర్ లీగ్ 2వ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసిన RCBకి చెందిన ఎల్లిస్ పెర్రీ ఆరెంజ్ క్యాప్ గెలుచుకుంది. దీంతో పాటు ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ రూ.5 లక్షల ప్రైజ్ మనీ లభించింది.

పర్పుల్ క్యాప్: ఈ టోర్నీలో 12 వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్ పర్పుల్ క్యాప్‌తో రూ.5 లక్షలు అందుకుంది.

బెస్ట్ స్ట్రైక్ రేట్ అవార్డు: ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యుత్తమ స్ట్రైక్ రేట్ సాధించిన RCB ప్లేయర్ జార్జియా వేర్‌హామ్‌కు రూ.5 లక్షలు లభించాయి. ప్రైజ్ మనీ అందుకుంది.

ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్లో 3 వికెట్లు తీసిన సోఫీ మోలినో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు రూ.2.5 లక్షలు గెలుచుకుంది.

అత్యధిక సిక్స్‌ల అవార్డు: మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2లో అత్యధిక సిక్సర్లు బాదిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ షఫాలీ వర్మ రూ. 5 లక్షలు. ప్రైజ్ మనీ అందుకుంది.

అత్యంత విలువైన క్రీడాకారిణి: యూపీ వారియర్స్‌కు చెందిన దీప్తి శర్మ ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌లో అత్యంత విలువైన ప్లేయర్‌గా అవతరించింది. ఈ అవార్డుతో దీప్తి రూ.5 లక్షల ప్రైజ్ మనీ అందుకుంది.

ఫైనల్ సిక్స్ అవార్డు: ఫైనల్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన షఫాలీ వర్మకు రూ.లక్ష ప్రైజ్ మనీ అందింది.

ఫెయిర్ ప్లే అవార్డు: టోర్నమెంట్ అంతటా అత్యుత్తమ క్రీడా నైపుణ్యంతో ఆడినందుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఫెయిర్ ప్లే అవార్డు లభించింది. ఈ అవార్డుతో ఆర్‌సీబీ జట్టుకు రూ.5 లక్షలు అందుతాయి.

విజేత: ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ట్రోఫీతో పాటు రూ.6 కోట్లు ప్రైజ్ మనీ అందుకున్నారు.

రన్నరప్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయింది. రూ.3 కోట్ల ప్రైజ్ మనీ అందుకుంది.

క్యాచ్ ఆఫ్ ది సీజన్: WPL 2023లో అత్యుత్తమ క్యాచ్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఎస్. సజనకు 5 లక్షల ప్రైజ్ మనీ లభించింది.




