- Telugu News Photo Gallery Cricket photos IPL 2024: Royal Challengers Bengaluru Sets Highest All Out Totals In T20 Cricket
IPL 2024: ఓటమిలోనూ ప్రపంచ రికార్డ్ సృష్టించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అదేంటంటే?
IPL 2024: IPL 2024 36వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా కేకేఆర్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన కేకేఆర్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన బెంగళూరు జట్టు ఇప్పుడు సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
Updated on: Apr 22, 2024 | 10:12 AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) 36వ మ్యాచ్ ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డును లిఖించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

ఈ కఠినమైన లక్ష్యాన్ని ఛేదించలేకపోయిన ఆర్సీబీ జట్టు ధీటైన పోరాటాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా చివరి బంతికి RCB జట్టుకు 2 పరుగులు చేయాల్సి ఉంది. ఈ దశలో లాకీ ఫెర్గూసన్ 2వ పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. దీంతో RCB 1 పరుగు తేడాతో నిరాశాజనక ఓటమిని చవిచూసింది.

ఈ షాకింగ్ ఓటమితో ఆర్సీబీ టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. అంటే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు చివరి బంతికి ఆలౌట్ అయింది. దీంతో పాటు టీ20 క్రికెట్‌లో ఆలౌట్ అయిన సమయంలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఆర్సీబీ నిలిచింది.

దీనికి ముందు, ఆల్ అవుట్‌గా అత్యధిక పరుగులు చేసిన ప్రపంచ రికార్డు శ్రీలంక జట్టు పేరిట ఉంది. 2018లో, నెగాంబో CC జట్టుపై 218 పరుగులు చేయడం ద్వారా SL ఆర్మీ T20 క్రికెట్‌లో ఈ ప్రపంచ రికార్డును సృష్టించింది.

ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB 221 పరుగులు చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టింది. దీంతో టీ20 క్రికెట్‌లో ఆలౌట్‌తో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది.




