- Telugu News Photo Gallery Cricket photos IND vs SL 2nd Test: Rohit Sharma and Ravindra Jadeja close to big mile stone in india vs sri lanka 2nd test
IND vs SL: ప్రమాదంలో సౌరవ్ గంగూలీ-ఏబీ డివిలియర్స్ రికార్డులు.. రోహిత్, జడేజాల దెబ్బకు మారనున్న ఆ జాబితా..
బెంగళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో డే-నైట్ మ్యాచ్‌గా జరగనుంది. రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు బ్యాటింగ్‌లో ప్రత్యేక రికార్డులు సాధించే అవకాశం ఉంది.
Updated on: Mar 09, 2022 | 9:46 PM

బెంగళూరు వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పింక్ బాల్‌తో డే-నైట్ మ్యాచ్‌గా జరగనుంది. రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు బ్యాటింగ్‌లో ప్రత్యేక రికార్డులు సాధించే అవకాశం ఉంది. ఈ స్పెషల్ రికార్డులకు కొన్ని అడుగుల దూరంలో నిలిచారు. ఈ విజయాలు టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల జాబితాకు సంబంధించినవి. బెంగళూరులో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా బ్యాట్‌తో అద్భుతాలు చేస్తే, ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను వెనక్కునెట్టేస్తారు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకు 44 టెస్టులు ఆడాడు. ఇందులో 63 సిక్సర్లు కొట్టాడు. అయితే టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ ఇప్పటికీ చాలా వెనుకంజలోనే ఉన్నాడు. బెంగుళూరు టెస్టులో రెండు సిక్సర్లు బాదిన వెంటనే ఓ పెద్ద బ్యాట్స్‌మెన్‌ని దాటేస్తాడు. రోహిత్ శర్మ 65 టెస్టు సిక్సర్లు బాదిన వెంటనే దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్‌ను అధిగమించనున్నాడు

ఏబీ డివిలియర్స్ టెస్టు క్రికెట్‌లో 64 సిక్సర్లు కొట్టాడు. ఇందుకోసం 114 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. రోహిత్ కంటే 70 టెస్టులు ఎక్కువగా ఆడిన డివిలియర్స్ 64 సిక్సర్లు బాదాడు. ఇటువంటి పరిస్థితిలో భారత కెప్టెన్ కోసం సిక్సర్ల రికార్డు ఎదురుచూస్తోంది.

అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఎడమచేతి వాటం ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా సత్తా చాటే అవకాశం ఉంది. అతను ఇప్పటివరకు 58 టెస్టులు ఆడి 55 సిక్సర్లు కొట్టాడు. మరో మూడు సిక్సర్లతో భారత్‌కు చెందిన సౌరవ్ గంగూలీ, పాకిస్థాన్‌కు చెందిన వసీం అక్రమ్‌లను అధిగమించనున్నాడు. మరోవైపు నాలుగు సిక్సర్లు బాది డేవిడ్ వార్నర్‌ను, ఐదు సిక్సర్లతో సనత్ జయసూర్య కంటే ముందు నిలవనున్నాడు.

సౌరవ్ గంగూలీ 113 టెస్టుల్లో 57 సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో, వసీం అక్రమ్ 104 టెస్టుల్లో అదే సంఖ్యలో సిక్సర్లు సాధించాడు. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 92 టెస్టుల్లో 58 సిక్సర్లు, శ్రీలంకకు చెందిన సనత్ జయసూర్య 110 టెస్టుల్లో 59 సిక్సర్లు బాదాడు.




