- Telugu News Photo Gallery Cricket photos IND vs BAN 1st Test Ravichandran Ashwin Equals Shane Warne’s record with 37th five wicket haul in Tests
Team India: టెస్ట్‌ల్లో అరుదైన ఫీట్.. వార్నర్ రికార్డ్‌ను సమం చేసిన అశ్విన్.. నెక్ట్స్ టార్గెట్ ఆయనే..
Ravichandran Ashwin Five Wicket Haul: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.
Updated on: Sep 22, 2024 | 2:57 PM

Ravichandran Ashwin Five Wicket Haul: బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

అయితే, ఈ మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఓ అద్భుత రికార్డ్‌ను తన ఖాతాలో లిఖించుకున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ షేన్ వార్న్ రికార్డ్‌ను సమం చేశాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో 37 సార్లు ఐదు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిని లిస్టులో రవిచంద్రన్ అశ్విన్ చేరాడు.

కాగా, ఈ లిస్టులో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు వికెట్లు పడగొట్టి, అగ్రస్థానంలో నిలిచాడు. అయితే, టీమిండియా స్పిన్నర్ అశ్విన్ 191 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం.

అంతకుముందు, అశ్విన్ మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో భారత్‌ను క్లిష్ట పరిస్థితుల నుంచి రక్షించాడు. టెస్ట్ ఫార్మాట్‌లో ఆరో సెంచరీ నమోదు చేశాడు. అలాగే, ఒకే టెస్టులో సెంచరీతోపాటు ఐదు వికెట్లు తీసిన అశ్విన్.. 4సార్లు ఇలాంటి ఫీట్‌ను సాధించాడు. దీంతో 5సార్లు ఈ ఫీట్‌ని సాధించిన మాజీ ఇంగ్లండ్ ఆల్-రౌండర్ ఇయాన్ బోథమ్ తర్వాత నిలిచాడు.

ఈ టీమిండియా ఆల్ రౌండర్ 88 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. మొదటి టెస్ట్‌లో భారతదేశం 280 పరుగుల ఆధిపత్య విజయాన్ని సాధించడంలో కీలక సహకారం అందించాడు.