WTC 2025: డబ్ల్యూటీసీ మాన్‌స్టర్‌లు.. సెంచరీలతో దడపుట్టిస్తోన్న టీమిండియా బ్యాటర్లు

5 Indian batters with most hundreds in WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్‌కు చేరేందుకు బంగ్లాదేశ్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి సంబంధించిన పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం 74 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచి 2 ఓడిపోగా, 1 మ్యాచ్ డ్రా చేసుకుంది.

Venkata Chari

|

Updated on: Sep 22, 2024 | 12:05 PM

Indian Batters Most Hundreds in WTC: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్‌కు ఎంతో దూరంలో లేదు. ప్రస్తుతం భారత జట్టు ఫైనల్‌కు చేరేందుకు బంగ్లాదేశ్‌తో పోరాడుతోంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీకి సంబంధించిన పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం 74 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 గెలిచి 2 ఓడిపోగా, 1 మ్యాచ్ డ్రా చేసుకుంది. టీమిండియా WTC 2025 ఫైనల్‌ను ఆడాలనుకుంటే, అది నిరంతరం బాగా రాణించవలసి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్స్ నుంచి సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆశిస్తున్నారు. ఇప్పటివరకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదుగురు భారతీయ బ్యాట్స్‌మెన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 6
5. విరాట్ కోహ్లీ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కింగ్ కోహ్లి బ్యాట్ అద్భుతంగా రాణించింది. కోహ్లి 37 మ్యాచ్‌లు ఆడిన 62 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో సహా 2258 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని వ్యక్తిగత స్కోరు 254* పరుగులుగా నిలిచింది. భారత్ తరపున డబ్ల్యూటీసీలో అత్యధిక సెంచరీలు సాధించిన వ్యక్తుల జాబితాలో విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో ఉన్నాడు.

2 / 6
4. రిషబ్ పంత్: బంగ్లాదేశ్‌పై సెంచరీ చేయడంతో రిషబ్ పంత్ ఈ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 25 టెస్టులు ఆడిన పంత్ 43 ఇన్నింగ్స్‌ల్లో 1723 పరుగులు చేశాడు. అతని పేరిట 4 సెంచరీలు నమోదయ్యాయి. చాలా కాలం తర్వాత పంత్‌ టీమ్‌ఇండియా తరుపున టెస్టుల్లోకి వచ్చాడు.

3 / 6
3. మయాంక్ అగర్వాల్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో మయాంక్ అగర్వాల్ మూడో స్థానంలో ఉన్నాడు. మయాంక్ 2019 నుంచి 2022 వరకు భారత్ తరపున 4 సెంచరీలు చేశాడు. ఈ కాలంలో అతను 19 మ్యాచ్‌లు ఆడాడు. అతను WTCలో 39.18 సగటుతో 1293 పరుగులు చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా జట్టులో స్థానం కోల్పోయాడు.

4 / 6
2. శుభ్‌మన్ గిల్: బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన తర్వాత, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్ కంటే శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 5 సెంచరీలు సాధించి రెండో స్థానానికి చేరుకున్నాడు. 2020 నుంచి గిల్ 26 మ్యాచ్‌లలో 48 ఇన్నింగ్స్‌లలో 37.46 సగటుతో 1611 పరుగులు చేశాడు. ఈ ఏడాది ఐదు సెంచరీల్లో మూడు సెంచరీలను శుభ్‌మన్ సాధించాడు.

5 / 6
1. రోహిత్ శర్మ: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 2019 నుంచి ఇప్పటి వరకు 33 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 56 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు సాధించాడు. అతను 48.35 సగటుతో 2563 పరుగులు చేశాడు.

6 / 6
Follow us