ఈ ప్రపంచ రికార్డు జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికాకు చెందిన క్వింటన్ డి కాక్‌లు అగ్రస్థానంలో ఉన్నారు. 23 ఏళ్లలోపు 113 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడిన సచిన్ 8 సెంచరీలతో రికార్డును లిఖించారు. క్వింటన్ డి కాక్ 52 ఇన్నింగ్స్‌ల్లో 8 వన్డే సెంచరీలు చేయడం ద్వారా ఈ రికార్డును సమం చేశాడు. ఇప్పుడు ఈ జాబితాలో విరాట్ కోహ్లీతో కలిసి రెహ్మానుల్లా గుర్బాజ్ 2వ స్థానాన్ని ఆక్రమించడంలో విజయం సాధించాడు.