- Telugu News Photo Gallery Cricket photos ICC World Cup Qualifiers 2023: Nicholas Pooran Century vs NED
ICC World Cup Qualifiers 2023: 6,6,6,6,6,6.. ఏం దంచుడు సామీ.. సెంచరీతో దుమ్మురేపిన నికోలస్ పూరన్..
ICC World Cup Qualifiers 2023: ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 2 సెంచరీలో అదరగొట్టాడు. తాజాగా సెంచరీ చేసిన నికోలస్.. దీనికి ముందు నేపాల్‌పై 94 బంతుల్లో 115 పరుగులు చేసి రఫ్పాడించాడు.
Updated on: Jun 27, 2023 | 10:11 AM

హరారేలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ మెరుపు సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. వెస్టిండీస్‌ను బ్యాటింగ్‌కు దిగింది.

ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్‌కు బ్రెండన్ కింగ్ (76), జాన్సన్ చార్లెస్ (54) పరుగులతో ఆరంభం నుంచే అదరగొట్టారు. వారి తరువాత వచ్చిన షాయ్ హోప్, నికోలస్ పూరన్ సైతం అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

షాయ్ హోప్ 38 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్లతో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కానీ మరోవైపు తుఫాన్ బ్యాటింగ్ ప్రదర్శించిన పూరన్ నెదర్లాండ్స్ బౌలర్లను చుక్కలు చూపించాడు.

పూరన్ బ్యాటింగ్ ధాటికి నెదర్లాండ్స్ బౌలర్లు చిత్తయ్యారు. పూరన్ 6 భారీ సిక్సర్లు, 9 ఫోర్లలతో చెలరేగి ఆడాడు.

పూరన్ కేవలం 63 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ పూర్తి చేశాడు. 65 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేయడంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.

వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో నికోలస్ పూరన్‌కి ఇది 2వ సెంచరీ. దీనికి ముందు నేపాల్‌పై 94 బంతుల్లో 115 పరుగులు చేశాడు. ఇప్పుడు అతను నెదర్లాండ్స్‌పై 65 బంతుల్లో అజేయంగా 104 పరుగులు చేశాడు.




