- Telugu News Photo Gallery Cricket photos Know Truth behind Sarfaraz Khan's wild celebration which denied him Team India spot, BCCI official reveals full details
BCCI: సెలెక్టర్లకు వేలు చూపిస్తూ వైల్డ్ సెలబ్రేషన్స్.. కట్‌చేస్తే.. నోఎంట్రీ బోర్డుతో షాకిచ్చిన బీసీసీఐ.. అసలు కారణం ఇదేనా?
Sarfaraz Khan: డొమెస్టిక్ యార్డ్‌లో 54 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 3505 పరుగులు చేశాడు. అయితే, సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతడిని ఎందుకు ఎంచుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Updated on: Jun 27, 2023 | 11:59 AM

Sarfaraz Khan: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో యువ స్ట్రైకర్ సర్ఫరాజ్ ఖాన్‌కు అవకాశం ఇవ్వకపోవడంపై తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ముఖ్యంగా సెలక్షన్ కమిటీ చర్యలపై టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. డొమెస్టిక్ యార్డ్‌లో 54 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్ 3505 పరుగులు చేశాడు. అయితే, సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతడిని ఎందుకు ఎంచుకోలేదంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈ ప్రశ్నలకు బీసీసీఐ అధికారి ఒకరు సమాధానమిచ్చారు. గత 3 రంజీ సీజన్లలో 900+ పరుగులు చేసిన ఆటగాడిని పరిగణనలోకి తీసుకోకపోవడంతో సెలెక్టర్లను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై మాట్లాడుతూ.. సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంచుకోకపోవడానికి ఆట మాత్రమే కాదని, ఇతర ప్రమాణాలు కూడా అతని ఎంపికకు ఆటంకం కలిగిస్తున్నాయని తెలిపాడు.

అంటే సర్ఫరాజ్ ఖాన్ ఫిట్ నెస్ విషయం కీలకంగా పరిగణిస్తున్నారు. సర్ఫరాజ్ కొద్దిగా బరువు తగ్గాలి. ఇక్కడ బ్యాటింగ్ మాత్రమే కాదు. ఆటగాళ్ల ఫిట్‌నెస్ కూడా ముఖ్యమని బీసీసీఐ అధికారి పీటీఐకి తెలిపారు. ఈ ప్రకటన తర్వాత మరో సమాచారం కూడా బయటకు వచ్చింది. రంజీ టోర్నీలో సర్ఫరాజ్ ఖాన్ అత్యుత్సాహం చూపడం సెలక్షన్ కమిటీ సభ్యుడిని ఆగ్రహానికి గురి చేసిందంట.

ఢిల్లీ వేదికగా జరిగిన రంజీ మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న సర్ఫరాజ్ ఖాన్.. డ్రెస్సింగ్ రూమ్ వైపు చేయి చూపించి వైల్డ్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. సెలక్షన్ కమిటీ సభ్యుడు సలీల్ అంకోలా కూడా స్టేడియంలోనే ఉన్నట్లు సమాచారం. ఆ రోజు నిర్ణయాత్మక మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ముంబై జట్టు కోచ్ అమోల్ ముజుందార్‌కు సర్ఫరాజ్ ఖాన్ చేయి చూపించి సంబరాలు చేసుకున్నాడు. ఈ అద్భుత ప్రదర్శనకు కోచ్ తన టోపీ తీసి నమస్కరించాడు.

అదే సమయంలో సెలెక్టర్ సలీల్ అంకోలా ఈ మొత్తం విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారని కొన్ని వర్గాలు తెలిపాయి. దీంతో సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాకు ఎంపిక చేయడం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎంతో ఒత్తిడిలో జట్టును విజయతీరాలకు చేర్చిన సర్ఫరాజ్ ఖాన్.. తన ఒత్తిడిని దూరం చేసుకునే విధంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అయితే దీనికి వేరే అర్థం ఉందని సర్ఫరాజ్ ఖాన్ సన్నిహిత వర్గాలు పీటీఐకి తెలిపాయి. ఈ వేడుక వెలుగులోకి రావడంతో సర్ఫరాజ్ ఖాన్ పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రతీకారం తీర్చుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తింది.





























