IPL 2025: ఆర్‌సీబీ తరపున ఆడతా.. కోహ్లీ చేతికి తొలి ట్రోఫీ అందిస్తా: డీపీఎల్ డేంజరస్ ప్లేయర్

Priyansh Arya: ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ప్రియాంష్ ఆర్య ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు బాదాడు. డీపీఎల్‌లో 2 సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ కూడా. ఇప్పుడు ఐపీఎల్ అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ యువ స్ట్రైకర్ ఆర్‌సీబీ తరపున ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు.

|

Updated on: Sep 03, 2024 | 9:56 AM

Priyansh Arya: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలి.. అలాగే ఆర్సీబీకి ఎండమావిగా మారిన ఐపీఎల్ ట్రోఫీని కూడా గెలవాలని ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతోన్న ప్రియాంష్ ఆర్య చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న డీపీఎల్‌లో అద్భుతంగా రాణిస్తున్న ప్రియాంష్.. ఆర్సీబీ తరపున ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు.

1 / 5
సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరపున ఆడుతున్న ప్రియాంష్ ఆర్య కేవలం 9 మ్యాచ్‌ల్లోనే 602 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతను 2 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు సాధించాడు. తుఫాన్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ రాబోయే ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.

2 / 5
దీనిపై ఓ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంష్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్. కాబట్టి నేను కూడా RCB తరపున ఆడాలనుకుంటున్నాను. తనకు అవకాశం వస్తే ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.

3 / 5
RCB జట్టు ఇప్పటి వరకు IPL ట్రోఫీని గెలవలేదు. ఈ లోపాన్ని అధిగమించాలి. అందుకు నేను బ్యాటింగ్ ద్వారా నా సహాయాన్ని అందిస్తాను. దీని ద్వారా ఆర్సీబీకి తొలి ట్రోఫీని అందజేయాలని కోరుకుంటున్నట్లు ప్రియాంష్ ఆర్య తెలిపాడు.

4 / 5
ప్రస్తుతం ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో సంచలనం సృష్టిస్తున్న ప్రియాంష్ ఆర్య ఈసారి ఐపీఎల్ వేలంలో కనిపించడం ఖాయం. కొన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే నార్త్ ఢిల్లీ ఓపెనర్‌పై కన్నేశారు. అయితే, ఈ యువ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ RCB తరపున ఆడాలనే కోరికను వ్యక్తం చేశాడు. మరి ఈసారి ప్రియాంష్ ఆర్యను RCB కొనుగోలు చేస్తుందో లేదో వేచి చూడాలి.

5 / 5
Follow us