- Telugu News Photo Gallery Cricket photos From Khalil Ahmed to KL Rahul and Krunal Pandya These 3 Big Indian Players Retun His Old Team in IPL 2025 Auction
IPL 2025: పాత జట్టుకే తిరిగి వచ్చేందుకు సిద్ధమైన ముగ్గురు భారత ఆటగాళ్లు.. లిస్టులో షాకింగ్ ప్లేయర్
మెగా వేలం కారణంగా చాలా మంది ఆటగాళ్లు విడుదల కానున్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఆటగాళ్ళు వారు ఇంతకు ముందు ఆడిన జట్లకు వెళ్ళవచ్చు. అంటే, పాత జట్టుకు తిరిగి రాగల ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Aug 12, 2024 | 11:33 AM

3 Players May Return Old Teams: ఐపీఎల్ 2025 (IPL 2025) వేలం కోసం సన్నాహాలు ప్రస్తుతం పూర్తి స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఎవరిని రిలీవ్ చేయాలి.. ఎవరిని రిటైన్ చేయాలి అనే విషయంలో ఒక్కో టీమ్ తనదైన వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఈసారి మెగా వేలం జరగనుంది. అందుకే వచ్చే సీజన్ నుంచి చాలా మార్పులు కనిపిస్తాయి. చాలా మంది కీలక ఆటగాళ్ల టీమ్‌లలో కూడా పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చు అని అంటున్నారు.

మెగా వేలం కారణంగా చాలా మంది ఆటగాళ్లు విడుదల కానున్నారు. ఇటువంటి పరిస్థితిలో, ఈ ఆటగాళ్ళు వారు ఇంతకు ముందు ఆడిన జట్లకు వెళ్ళవచ్చు. అంటే, పాత జట్టుకు తిరిగి రాగల ముగ్గురు ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

3. ఖలీల్ అహ్మద్ (సన్‌రైజర్స్ హైదరాబాద్): లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగంగా ఉన్నాడు. 2016లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తన కెరీర్‌ను కూడా ప్రారంభించాడు. అయితే, ఆ తర్వాత అతను సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వెళ్లి అనేక సీజన్లలో వారి కోసం ఆడాడు. ఐపీఎల్ 2019లో ఖలీల్ 19 వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ IPL 2022కి ముందు విడుదలయ్యాడు. అతను మళ్లీ ఢిల్లీ జట్టుకు తిరిగి వచ్చాడు. అయితే, ఇప్పుడు అతను వచ్చే సీజన్ నుంచి మరోసారి సన్‌రైజర్స్‌కు తిరిగి రావచ్చు అని భావిస్తున్నారు.

2. కృనాల్ పాండ్యా (ముంబై ఇండియన్స్): కృనాల్ పాండ్యా తన IPL కెరీర్‌ను ముంబై ఇండియన్స్ కోసం ప్రారంభించాడు. చాలా సీజన్లలో ఆ జట్టు తరపున కోసం ఆడాడు. జట్టుకు అనేక టైటిళ్లు సాధించడంలో కృనాల్ పాండ్యా అందించిన సహకారం ఎంతో ఉంది. అయితే, IPL 2022 నుంచి అతను లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరాడు. ఇప్పుడు మెగా వేలానికి ముందే విడుదలై మళ్లీ ముంబై జట్టులోకి వెళ్లొచ్చు.

1. కేఎల్ రాహుల్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు): KL రాహుల్ తన IPL కెరీర్‌ను 2013లో RCB తరపున ప్రారంభించాడు. అతను చాలా సీజన్లలో RCBలో భాగంగా ఉన్నాడు. ఆ తర్వాత అతను విడుదలయ్యాడు. దీని తర్వాత పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా చేసింది. అక్కడ కొన్ని సీజన్లు ఆడిన తర్వాత, KL లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడు అక్కడి నుంచి కూడా విడుదల కావచ్చని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే, RCB మళ్లీ కేఎల్ రాహుల్‌ని తమ జట్టులోకి ఆహ్వానించే అవకాశం ఉంది.




