- Telugu News Photo Gallery Cricket photos IPL 2025: Rishabh Pant to stay at Dehli Capitals Says Sourav Ganguly
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిషబ్ పంత్ తప్పుకుంటాడా.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?
IPL 2025: IPL 2025 కోసం మెగా వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలానికి ముందు ఒక్కో జట్టు నలుగురు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఈ వేలానికి ముందు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి తప్పుకుంటాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు.
Updated on: Aug 12, 2024 | 12:37 PM

ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెడతాడని డీసీ ఫ్రాంచైజీ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ చెప్పినట్లు వార్తలొచ్చాయి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పంత్ కొనసాగుతాడంటూ కూడా నివేదికలు వస్తున్నాయి. మరి అసలు పంత్ పరిస్థితి ఏంటి? గంగూలీ అసలేం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం..

రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వదిలి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఈసారి మెగా వేలంలో పంత్ కనిపించడం దాదాపు ఖాయమైందని అంటున్నారు.

ఈ వార్తలన్నింటినీ సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025లో జట్టుకు ఆడటం కొనసాగించనున్నాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ అతన్ని విడిచిపెట్టదని దాదా ధృవీకరించడంతో పంత్ మార్పు దాదాపు లేనట్టేనని తెలుస్తోంది.

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నుంచి రిషబ్ పంత్ వైదొలగనున్నాడన్న ప్రచారానికి తెరపడింది. రాబోయే సీజన్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీ అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో పంత్ పేరు కూడా ఉన్నట్లు ధృవీకరించారు. ఐపీఎల్ 2025లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా రిషబ్ పంత్ కనిపిస్తాడని చెప్పొచ్చు.

ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్‌గా రికీ పాంటింగ్‌ను తొలగించారు. తద్వారా ఐపీఎల్ సీజన్-18లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో భారత కోచ్ కనిపించే అవకాశం ఉంది. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీతో సహా కొందరు మాజీ ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి, ఐపీఎల్ 2025లో ఢిల్లీ జట్టుకు దాదా ప్రధాన కోచ్ పదవిని అధిష్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు.




