- Telugu News Photo Gallery Cricket photos Check out MS Dhoni top 5 expensive bikes in his garage like Confederate Hellcat X132, Kawasaki Ninja H2, Ducati 1098, Harley davidson fatboy, Suzuki Hayabusa
MS Dhoni: ధోని గ్యారేజీలో అత్యంత ఖరీదైన 5 బైక్స్ ఇవే.. లిస్ట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
MS Dhoni top 5 Most Expensive Bikes: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బైక్‌లంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించే ముందు, ధోనీ తన మొదటి బైక్‌ను యమహా ఆర్‌ఎక్స్-135ను కొనుగోలు చేశాడు. అయితే నేడు ధోని వద్ద ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు ఉన్నాయి. 43 ఏళ్ల లెజెండ్ గ్యారేజ్‌లో ఎక్సోటిక్స్, పాతకాలపు మోటార్‌సైకిళ్లు, కొన్ని సూపర్‌బైక్‌లతో నిండి ఉంది.
Updated on: Jul 10, 2024 | 7:05 PM

MS Dhoni top 5 Most Expensive Bikes: భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బైక్‌లంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించే ముందు, ధోనీ తన మొదటి బైక్‌ను యమహా ఆర్‌ఎక్స్-135ను కొనుగోలు చేశాడు. అయితే నేడు ధోని వద్ద ఒకటి కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు ఉన్నాయి.

43 ఏళ్ల లెజెండ్ గ్యారేజ్‌లో ఎక్సోటిక్స్, పాతకాలపు మోటార్‌సైకిళ్లు, కొన్ని సూపర్‌బైక్‌లతో నిండి ఉంది. ప్రస్తుతం ధోని వద్ద 100 కంటే ఎక్కువ మోటార్ సైకిళ్లు ఉన్నాయి. ధోని గ్యారేజీలో ఉన్న ప్రత్యేకమైన, ఖరీదైన మోటార్‌సైకిళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

5. సుజుకి హయబుసా: ధూమ్ సినిమాలో సుజుకి హయబుసా అందాన్ని చూసే ఉన్నాం. ధోనీ బైక్ కలెక్షన్‌లో దాని పేరు కూడా ఉంది. ఈ బైక్‌లో 1340 cc, ఇన్-లైన్ 4, ఫ్యూయల్ ఇంజెక్ట్, లిక్విడ్-కూల్డ్ DOHC ఇంజన్ ఉంది. ఇది 190 hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 150 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర దాదాపు రూ.16.5 లక్షలు.

4. హార్లే డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్: ధోనీ దగ్గర హార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ లాంటి ఖరీదైన బైక్ కూడా ఉంది. రాంచీలో ధోనీ చాలాసార్లు ఈ ద్విచక్ర వాహనాన్ని నడుపుతూ కనిపించాడు. ఈ బైక్‌లో 1690 cc ఇంజన్ ఉంది, ఇది 65 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర దాదాపు రూ.22 లక్షలు.

3. డుకాటీ 1098: ఎంఎస్ ధోని బైక్ గ్యారేజీలో డుకాటీ 1098 కూడా ఉంది. ధోని అత్యంత ప్రత్యేకమైన సూపర్ బైక్‌లలో ఇది ఒకటిగా పేరుగాంచింది. పవర్ కోసం, బైక్ 1099 cc ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది 160 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ధర దాదాపు రూ.35 లక్షలు.

2. కవాసకి నింజా H2: ఎంఎస్ ధోని బైక్ కలెక్షన్‌లో కవాసకి నింజా H2 పేరు కూడా ఉంది. ఈ బైక్‌లో 998 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ ద్విచక్ర వాహనానికి 11000 ఆర్‌పీఎమ్ వద్ద 200 హార్స్ పవర్‌ల శక్తిని ఇస్తుంది. ఎస్ఎస్ ధోనీకి చెందిన ఈ బైక్ ధర దాదాపు రూ.36 లక్షలు ఉంటుందని సమాచారం.

1. కాన్ఫెడరేట్ హెల్‌క్యాట్ X132: ధోనీకి చెందిన అత్యంత ఖరీదైన బైక్ కాన్ఫెడరేట్ హెల్‌క్యాట్ ఎక్స్132. ప్రపంచం మొత్తం మీద కేవలం 150 మందికి మాత్రమే ఈ బైక్ ఉంది. సౌత్ ఈస్ట్ ఆసియాలో, ఈ బైక్ మహేంద్ర సింగ్ ధోని గ్యారేజీలో చేరింది. ఈ మోటార్‌సైకిల్‌ను ప్రత్యేకమైన, అరుదైన బైక్‌గా పిలుస్తుంటారు. ఈ బైక్ ధర దాదాపు రూ.47 లక్షలు.




