- Telugu News Photo Gallery Cricket photos Afghanistan Star Player Gujarat Titans all rounder Rashid Khan Creates New World Record In T20I before IPL 2024
IPL 2024: 4 ఓవర్లలో 1 వికెట్.. టీ20లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ ప్రపంచ రికార్డ్.. అదేంటో తెలుసా?
Rashid Khan Records: ఐర్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో గెలుచుకుంది. అఫ్గాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఈ సిరీస్‌లో మొత్తం 8 వికెట్లు తీసి ఎన్నో రికార్డులు సృష్టించాడు. అందులో ఒకటి ప్రపంచ రికార్డు కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ 2024కు ముందు ఈ రికార్డ్ నెలకొల్పడంతో.. గుజరాత్ టీం సతోషంలో మునిగిపోయింది.
Updated on: Mar 19, 2024 | 1:46 PM

షార్జా వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రషీద్ ఖాన్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. తటస్థ మైదానంలోనూ తన స్పిన్‌తో రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ 12 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు.

ఈ ఒక్క వికెట్‌తో తటస్థ మైదానంలో 100 వికెట్లు తీసిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో ఎవరూ చేయని ప్రత్యేకతను అఫ్గాన్ స్పిన్నర్ సాధించాడు.

అలాగే ఐర్లాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల సిరీస్‌లో మొత్తం 8 వికెట్లు తీసిన రషీద్ ఖాన్.. టీ20 క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు.

అంతకుముందు న్యూజిలాండ్‌కు చెందిన ఇష్ సోధి మూడో స్థానంలో ఉన్నాడు. 107 టీ20 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు ఆడిన సోధీ మొత్తం 132 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఇప్పుడు న్యూజిలాండ్ స్పిన్నర్‌ను ఆఫ్ఘన్ బౌలర్ అధిగమించాడు.

ఆఫ్ఘనిస్థాన్ తరపున 85 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన రషీద్‌ఖాన్ ఇప్పటివరకు 138 వికెట్లు పడగొట్టాడు. దీంతో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నాడు.

ఈ జాబితాలో న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ అగ్రస్థానంలో ఉన్నాడు. కివీస్ తరపున 120 టీ20 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసిన సౌథీ మొత్తం 157 వికెట్లు పడగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

షకీబ్ అల్ హసన్ కూడా రెండో స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ 115 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 140 వికెట్లు పడగొట్టాడు. దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్‌గా నిలిచాడు.




