- Telugu News Photo Gallery Copper water bottle can be easily cleaned in minutes, check here is details
Kitchen Hacks: ఈజీగా కాపర్ బాటిల్ క్లీనింగ్.. నిమిషాల్లో తెల్లగా మెరుస్తుంది..
ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే రాగి, ఇత్తడి, స్టీల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా రాగి వాటర్ బాటిల్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాగి అనేది లోహం కాబట్టి దీనికి త్వరగా నల్లబడే గుణం ఉంది. వీటిని వాడేందుకు సులువుగా ఉన్నా.. క్లీన్ చేయడం చాలా కష్టం. కానీ కొన్ని రకాల టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఉప్పు, వెనిగర్, నిమ్మరసం.. ఈ మూడు కలిపి ఓ ద్రవాన్ని తయారు చేయండి. అన్నీ సమపాళల్లో..
Updated on: Oct 03, 2024 | 5:02 PM

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఈ క్రమంలోనే రాగి, ఇత్తడి, స్టీల్ వాటర్ బాటిల్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా రాగి వాటర్ బాటిల్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాగి అనేది లోహం కాబట్టి దీనికి త్వరగా నల్లబడే గుణం ఉంది. వీటిని వాడేందుకు సులువుగా ఉన్నా.. క్లీన్ చేయడం చాలా కష్టం. కానీ కొన్ని రకాల టిప్స్‌తో ఈజీగా క్లీన్ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఉప్పు, వెనిగర్, నిమ్మరసం.. ఈ మూడు కలిపి ఓ ద్రవాన్ని తయారు చేయండి. అన్నీ సమపాళల్లో తీసుకోండి. ఈ ద్రవాణాన్ని బాటిలపై స్ప్రే చేసి స్క్రబ్బర్‌తో రుద్దితే చాలా తెల్లగా బాటిల్ మెరుస్తుంది. మలినాలు, మురికి కూడా ఈజీగా పోతుంది.

కాపర్ బాటిల్స్‌ను తెల్లగా మార్చడంలో బేకింగ్ సోడా కూడా చక్కగా పని చేస్తుంది. బేకింగ్ సోడా క్లీనింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది బేకింగ్ సోడాలో వెనిగర్ లేదా నిమ్మరసం పిండి బాటిల్స్‌పై రుద్దండి. ఆ తర్వాత కడిగితే బాటిల్ల తెల్లగా మెరుస్తుంది.

చింత పండుతో రాగి, ఇత్తడి వస్తువులను క్లీన్ చేయడం పూర్వం నుంచి కూడా ఉపయోగిస్తూ ఉంటున్నారు. చింత పండును నీటిలో కొద్దిగా నానబెట్టి బాటిల్‌పై రుద్దండి. చింతపండులో ఉండే సిట్రిక్ యాసిడ్.. మలినాలు, దుర్వాసనను పోగొట్టి.. తెల్లగా మార్చుతుంది.

మీరు మరింత సులువుగా క్లీన్ చేయాంటే ఒక బౌల్‌లో నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా సర్ఫ్, బేకింగ్ సోడా, నిమ్మరసం లేదా చింత పండు రసం వేసి బాగా మరిగించండి. అనంతరం స్టవ్ ఆఫ్ చేసి.. అందులో ఈ బాటిల్ ఓ రెండు నిమిషాలు ఉంచితే తెల్లగా మారుతుంది.




