దానిమ్మ పండు పోషకాలు మెండు.. దానిమ్మ పండుతింటే.. ఆరోగ్యానికి మేలు అన్న సంగతి తెలిసిందే. దానిమ్మ తింటే..అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే దానిమ్మ పండు మాత్రమే కాదు.. ఆకులు, బెరడు కూడా అనేక వ్యాధ్యులను నివారిస్తుంది. దాడిమీ పత్రి అంటూ వినాయక చవితి రోజున గణపతిని పూజిస్తాం.. ఈ ఆకు పత్రి పూజా క్రమంలో పన్నెండవది. ఇక దానిమ్మ పండులాగే ఆకు కూడా ఎరుపు రంగులో చిన్నగా, గుండ్రంగా ఉంటుంది. ఈ ఆకు పసరు వాసన వస్తుంది. ఈ పత్రి విశిష్టత ఆయుర్వేదంలో చెప్పబడింది. దానిమ్మ ఆకులతో ఏఏ ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో తెలుసుకుందాం.