- Telugu News Photo Gallery Coffee for Diabetes: How Does Coffee Effect Diabetes? Know Its Effect On Blood Sugar Levels
Coffee for Diabetes: డయాబెటిస్ రోగులు కాఫీ తాగితే ఏం జరుగుతుందో తెలుసా!
నేటి కాలంలో ప్రతి ఇంట్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. వీరు తప్పరిసరిగా తమ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా టీ, కాఫీలలో పంచదార వేయడం పూర్తిగా మానేయాలి. అయితే పంచదార లేదకుడా టీ, కాఫీలు తాగొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణులు ఏమంటున్నారంటే..
Updated on: Jul 15, 2024 | 6:28 AM

నేటి కాలంలో ప్రతి ఇంట్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటున్నారు. వీరు తప్పరిసరిగా తమ ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముందుగా టీ, కాఫీలలో పంచదార వేయడం పూర్తిగా మానేయాలి. అయితే పంచదార లేదకుడా టీ, కాఫీలు తాగొచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. నిపుణులు ఏమంటున్నారంటే..

చక్కెర, పాలు లేని టీని డయాబెటిస్‌లో తీసుకోవచ్చు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాఫీ ఎంతవరకు ఉపయోగపడుతుందనేది అసలు ప్రశ్న. మీకూ డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయితే, కాఫీ తాగాలా వద్దా అని సంశయిస్తున్నట్లయితే.. నిరభ్యంతరంగా తాగొచ్చంటున్నారు నిపుణులు. అయితే అందులో చక్కెర, పాలు వినియోగించకూడదు. ఇవి రెండూలేని టీని మాత్రమే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తీసుకోవాలి.

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు డయాబెటిక్ పేషెంట్లలో గుండె సమస్యలు అధికంగా ఉంటాయి. అందువల్ల కాఫీ తాగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.

రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు సైతం చెబుతున్నాయి. 4 సంవత్సరాల పాటు రోజుకు 1 కప్పు కాఫీ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం 11 శాతం తగ్గుతుందని 2013లో ఓ అధ్యయనంలో తేలింది.

శరీరంలో కెఫిన్ పరిమాణం పెరిగినప్పుడు చాలా సార్లు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అలాంటప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు వివిధ సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి కెఫిన్ లేని కాఫీ తాగడానికి ప్రయత్నించాలి.