JR.NTR: స్పీడ్ పెంచిన తారక్. దేవర నుండి వార్ 2 సెట్స్ కు షిఫ్ట్ అవనున్న ఎన్టీఆర్.
ట్రిపులార్ తరువాత సెట్‌లో అడుగు పెట్టేందుకు కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్న ఎన్టీఆర్, వన్స్ షూటింగ్‌కు షురూ చేశాక మాత్రం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతున్నారు. తాజాగా దేవర కాంపౌండ్ నుంచి వస్తున్న ఓ అప్‌డేట్ జూనియర్ అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. ట్రిపులార్ రిలీజ్ తరువాత దాదాపు ఏడాది పాటు కెమెరా ముందుకు రాలేదు జూనియర్ ఎన్టీఆర్. తన కోస్టార్ రామ్ చరణ్ ట్రిపులార్ సెట్స్ మీద ఉండగానే మరో మూవీని స్టార్ట్ చేస్తే, తారక్ మాత్రం ఎనౌన్స్ చేసిన సినిమాను కూడా పట్టాలెక్కించేందుకు చాలా టైమ్ తీసుకున్నారు.