- Telugu News Photo Gallery Cinema photos Young Hero Dulquer Salmaan New Movie Lucky Bhaskar Teaser Response
Lucky Bhaskar: అక్కడి నుండి వచ్చి టాలీవుడ్ స్టార్ హీరోస్‌తో పాటు దూసుకుపోతున్న లక్కీ భాస్కర్ దుల్కర్.
ఒక కామన్.. మిడిల్ క్లాస్.. ఇండియన్ మేన్.. అసాధారణమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు.. ఆద్యంతం ఇంట్రస్టింగ్‌గా ఉంది లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్‌గా తెలుగులో సినిమా చేసిన ప్రతిసారీ సరికొత్త మార్కెట్‌ని క్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్‌గా ఆయన ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్. దుల్కర్ సల్మాన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న సినిమా లక్కీ భాస్కర్.
Updated on: Apr 12, 2024 | 9:20 PM

ఒక కామన్.. మిడిల్ క్లాస్.. ఇండియన్ మేన్.. అసాధారణమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు.. ఆద్యంతం ఇంట్రస్టింగ్‌గా ఉంది లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ స్ట్రెయిట్‌గా తెలుగులో సినిమా చేసిన ప్రతిసారీ సరికొత్త మార్కెట్‌ని క్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు.

ఇప్పుడు బ్యాంక్ క్యాషియర్‌గా ఆయన ఏం చేయబోతున్నారన్నది సస్పెన్స్. దుల్కర్ సల్మాన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.

ముచ్చటగా మూడో సారి నటించాలని ఎంత ట్రై చేసినా.. కాల్షీట్లు కుదరకపోవడంతో సారీ చెప్పారు రవి. ఓకే బంగారం లాంటి హిట్ మూవీ ఉన్నా, కమల్‌తో పనిచేయాలన్న కోరిక ఉన్నా, సినిమా నుంచి తప్పుకోక తప్పట్లేదని బాధపడ్డారు సిల్వర్ స్క్రీన్ లక్కీ భాస్కర్ మిస్టర్ దుల్కర్.

మామూలు జీతగాడు అంత భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు.? అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగిందన్నది సినిమా మీద క్యూరియాసిటీని కలిగిస్తోంది.

మధ్య తరగతి మనస్తత్వాల గురించి దుల్కర్ చెప్పే డైలాగులు రిపీటెడ్‌గా వినాలపిస్తున్నాయి. కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఆడియన్స్ ని మెప్పిస్తున్నాయి.

ప్యాన్ ఇండియా లెవల్లో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మహానటి, సీతారామమ్ సినిమాల్లో దుల్కర్ నటనకు ఫిదా అయ్యారు తెలుగు ఆడియన్స్. ఇప్పుడు లక్కీ భాస్కర్ టీజర్ ఆయన్ని సరికొత్తగా చూపిస్తోంది.

సరికొత్త టింజ్‌తో మెస్మరైజ్ చేస్తోన్న ప్రమోషనల్ కంటెంట్ లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ దాడి ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది. మంచి పాటలు, పర్ఫెక్ట్ సీన్స్, మంచి రిలీజ్ టైమ్ కుదిరితే... సినిమా మరో లెవల్లో కలెక్ట్ చేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండిట్స్.





























