- Telugu News Photo Gallery Cinema photos Young beauty priya prakash varrier shared her latest stunning photos
Priya Prakash Varrier: చూపుతోనే ప్రేమలో పడేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్..
ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్ లవ్’ సినిమాలోని సెకన్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది.
Updated on: Oct 27, 2025 | 1:53 PM

ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్ లవ్’ సినిమాలోని సెకన్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఇక ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రియాకు సినిమా అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రియా మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘చెక్’ సినిమా చేసింది.

చెక్ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. చెక్ సినిమా తర్వాత తిరిగి మలయాళంలో బిజీగా మారింది. తెలుగులో చాలా కాలం తర్వాత మెగా మల్టీస్టారర్ మూవీ బ్రో సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా జ్ = డిజాస్టర్ అయ్యింది.

ఇటీవల, ఆమె "గుడ్ బ్యాడ్ అగ్లీ" చిత్రంలో అజిత్ కుమార్‌తో కలిసి నటించింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అలాగే బాలీవుడ్‌లో "త్రీ మంకీస్", "లవ్ హ్యాకర్స్", కన్నడ చిత్రం "విష్ణు ప్రియ" వంటి ప్రాజెక్టుల్లో బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన క్రేజీ ఫోటోషూట్‌లు, డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ పిక్స్ కు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.