- Telugu News Photo Gallery Cinema photos Yash mother says dont movie with her son know the reason why
Yash: హీరో యష్ తో సినిమాలు చేయనంటున్న తల్లి.. ఎందుకో మీరే చుడండి
కొత్తవారు ట్రెండింగ్‌లోకి రావాలంటే కష్టపడాలేమోగానీ, స్టార్ హీరోలు ఎటు కదిలినా వార్తే. కొన్ని సార్లు వాళ్లు వార్తల్లో ఉండటానికి వాళ్లు ఆ మాత్రం కూడా కదలక్కర్లేదు..మిగిలిన వారి మాటల్లో వినిపిస్తే సరిపోతుంది... ఇప్పుడు యష్ పేరు అలాగే ట్రెండ్ అవుతోంది.. యష్ పేరు కర్ణాటకలో జస్ట్ నేమ్ కాదు, అదో బ్రాండ్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పుడు కర్ణాటకి జబర్దస్త్ గా రెప్రజెంట్ చేస్తున్నారు యష్.
Updated on: May 23, 2025 | 4:32 PM

యష్ పేరు కర్ణాటకలో జస్ట్ నేమ్ కాదు, అదో బ్రాండ్. ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఇప్పుడు కర్ణాటకి జబర్దస్త్ గా రెప్రజెంట్ చేస్తున్నారు యష్. ఆయన తల్లి కూడా నిర్మాతగా మారారు.

యష్ తోనూ మీరు సినిమాను నిర్మిస్తారా? అనే ప్రశ్న ఎదురైంది ఆమెకు. అదన్నమాట సంగతి. కడుపు నిండిన వారికి అన్నం పెట్టను. యష్ దగ్గర బాగానే డబ్బులున్నాయి.

తనకు ఎలాంటి సినిమాలు కావాలంటే, అలాంటి సినిమాలు తీసుకోగలడూ.. అని అతని తల్లి చెప్పిన మాటలు విన్నారుగా.. ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.

పక్కా మాస్ లుక్‌లో కనిపించడం యష్‌కి ఇష్టం. మాస్ కంటెంట్‌కే జనాలు కాసులు కురిపిస్తారని బాగా ఫిక్సయ్యారు యష్. అందుకే ఆ తరహా సినిమాలు తీసుకుంటున్నారట. ఈ విషయాన్ని కూడా చెప్పేశారు ఆయన మాతృమూర్తి.

యష్ తల్లికి ఆయన్ని స్టైలిష్‌గా చూసుకోవాలంటే ఇష్టమట. స్క్రీన్ మీద అలా కనిపిస్తే, నువ్వు తప్ప ఎవరు చూస్తారంటూ యష్ సరదాగా ఆటపట్టిస్తారని చెప్పారు యష్ మదర్. ప్రస్తుతం టాక్సిక్, నార్త్ రామాయణ్‌తో బిజీగా ఉన్నారు యష్. నెక్స్ట్ ఇయర్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతోప్రేక్షకులను అలరించడం ఖాయం అన్నమాట.




