- Telugu News Photo Gallery Cinema photos Who gave Rajamouli the title of work monster here is the details
Rajamouli: రాజమౌళికి పని రాక్షసుడు అనే బిరుదు ఇచ్చిందెవరు ??
పని రాక్షసుడు అనే పేరుకు టాలీవుడ్‌లో కేరాఫ్ ఎవరో తెలుసా? ప్రభాస్ ముద్దుగా మ్యాడ్ మ్యాన్ అని పిలుచుకునే డైరక్టర్ ఎవరో తెలుసా? ఆర్గ్యూ చేయడం వేస్ట్... ఆయనకేం కావాలో అది ఇచ్చేసి వెళ్లిపోదామని తారక్ అనుకునేది ఎవరి సెట్లో తెలుసా?.... ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మోడ్రన్ మాస్టర్స్ లో రాజమౌళి జర్నీని మిస్ కాకూడదు.. స్టూడెంట్ నెంబర్ ఒన్ నుంచి ట్రిపుల్ ఆర్ దాకా రాజమౌళి జర్నీ ఎలా సాగిందో తెలుగు ప్రేక్షకులకు తప్పక ఐడియా ఉంటుంది.
Updated on: Jul 24, 2024 | 9:03 PM

పని రాక్షసుడు అనే పేరుకు టాలీవుడ్‌లో కేరాఫ్ ఎవరో తెలుసా? ప్రభాస్ ముద్దుగా మ్యాడ్ మ్యాన్ అని పిలుచుకునే డైరక్టర్ ఎవరో తెలుసా? ఆర్గ్యూ చేయడం వేస్ట్... ఆయనకేం కావాలో అది ఇచ్చేసి వెళ్లిపోదామని తారక్ అనుకునేది ఎవరి సెట్లో తెలుసా?.... ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలనుకుంటే మర్చిపోకుండా మోడ్రన్ మాస్టర్స్ లో రాజమౌళి జర్నీని మిస్ కాకూడదు..

స్టూడెంట్ నెంబర్ ఒన్ నుంచి ట్రిపుల్ ఆర్ దాకా రాజమౌళి జర్నీ ఎలా సాగిందో తెలుగు ప్రేక్షకులకు తప్పక ఐడియా ఉంటుంది. ఓటమన్నది ఎరుగని డైరక్టర్‌గా సిల్వర్‌స్క్రీన్ మీద స్టాంప్ వేశారు డైరక్టర్ రాజమౌళి. ఆయన గురించి చెప్పమంటే ఆయనతో పనిచేసిన వారు, పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు... ప్రపంచం నలుమూలల నుంచీ సినీ ప్రియులు సిద్ధమైపోతారు...

బయటివారు ఎవరు ఏం చెప్పినా.. రాజమౌళితో పని చేయడంలో ఉన్న కష్టం గురించి ట్రైలర్‌లో కీరవాణి ఏం చెప్పారు? తారక్ ఎందుకు నవ్వారు? అనే ఆసక్తి జనాల్లో బాగా క్రియేటైంది. ప్రభాస్, చరణ్, కరణ్‌జోహార్, రమా రాజమౌళి మనసులోని మాటలను వినాలంటే ఆగస్టు 2 వరకు ఆగాల్సిందే.

కెప్టెన్ కుర్చీలో కూర్చుని ఆదేశాలు ఇవ్వడమే కాదు, స్పాట్‌లో నటుడిగా మారిపోయి ప్రతి ఆర్టిస్టుకీ జక్కన్న సీన్‌ని ఎక్స్ ప్లయిన్ చేసే తీరుకు ఫిదా అవుతున్నారు మోడ్రన్ మాస్టర్స్ ట్రైలర్ చూసిన వారు.

గతంలో యమదొంగ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్‌ను తెర మీద చూపించిన జక్కన్న.. ఈ సారి మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణను ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తారా అన్న క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది.




