- Telugu News Photo Gallery Cinema photos Vishwak Sen's interesting comments on JR.NTR in mechanic rocky movie promotion Telugu Heroes Photos
Vishwak Sen: విశ్వక్ సేన్ పై ఎన్టీఆర్ ముద్ర మంచిదేనా.? నెట్టింట ట్రేండింగ్..
జూనియర్ ఎన్టీఆర్‌ని నిజంగానే విశ్వక్ సేన్ ఇమిటేట్ చేస్తున్నారా లేదంటే ఇన్‌బిల్ట్ తెలియకుండానే అలా వచ్చేస్తుందా..? విశ్వక్‌ను చూస్తుంటే తారక్‌ను చూసినట్లు ఉందంటున్నారు ఫ్యాన్స్. అది తన కెరీర్‌కు డేంజర్ అని తెలిసినా.. విశ్వక్ ఎందుకు అలానే చేస్తున్నారు..? తన సినిమాల కోసం ఎన్టీఆర్ క్రేజ్ వాడుకోవాలని ఫిక్సైపోయారా..? ఈ టీజర్ చూస్తుంటే మనకు వద్దన్నా కూడా జనతా గ్యారేజ్ గుర్తుకొస్తుంది.
Updated on: Jul 29, 2024 | 1:11 PM

జూనియర్ ఎన్టీఆర్‌ని నిజంగానే విశ్వక్ సేన్ ఇమిటేట్ చేస్తున్నారా లేదంటే ఇన్‌బిల్ట్ తెలియకుండానే అలా వచ్చేస్తుందా..? విశ్వక్‌ను చూస్తుంటే తారక్‌ను చూసినట్లు ఉందంటున్నారు ఫ్యాన్స్.

అది తన కెరీర్‌కు డేంజర్ అని తెలిసినా.. విశ్వక్ ఎందుకు అలానే చేస్తున్నారు..? తన సినిమాల కోసం ఎన్టీఆర్ క్రేజ్ వాడుకోవాలని ఫిక్సైపోయారా..? ఈ టీజర్ చూస్తుంటే మనకు వద్దన్నా కూడా జనతా గ్యారేజ్ గుర్తుకొస్తుంది.

అందులో జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి లుక్‌లో కనిపించారో.. మెకానిక్ రాకీలోనూ విశ్వక్ అలాగే కనిపిస్తున్నారు. ఈ జనరేషన్ హీరోలలో తారక్‌కు విశ్వక్ సేన్ పెద్ద ఫ్యాన్.. ఇంకా చెప్పాలంటే ఏసీ కూడా.

ఆయనంటే అంత ప్రాణం. అందుకే తెలియకుండానే ఎన్టీఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ విశ్వక్‌పై కనిపిస్తుంది. ధమ్కీ నుంచి జూనియర్ ఎన్టీఆర్‌తో విశ్వక్ రిలేషన్ మరింత స్ట్రాంగ్ అయిపోయింది. ఆ సినిమా ప్రీ రిలీజ్‌కు ముఖ్య అతిథిగా వచ్చారు తారక్.

అక్కడే తనకు ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను చూపించారు మాస్ కా దాస్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ చాలా సీన్స్‌లో విశ్వక్ సేన్‌ను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూస్తున్నట్లు ఉందనే కమెంట్స్ కూడా వినిపించాయి.

తాజాగా మెకానిక్ రాకీ టీజర్‌లోనూ తారక్ స్టైల్‌లోనే కనిపించారు విశ్వక్. ఇదే ప్రశ్నను ఆయన్ని అడిగితే.. ఇద్దరిలోనూ సేమ్ ఎనర్జీ ఉంటుంది.. అందుకే అలా అనిపిస్తుందేమో అంటూ సేఫ్ ఆన్సర్ ఇచ్చారు.

తెలిసి చేస్తున్నారా లేదంటే డీఫాల్ట్ అలా వచ్చేస్తుందా తెలియదు కానీ.. విశ్వక్‌పై మాత్రం NTR ఇన్‌ఫ్లూయెన్స్ బాగా ఉందనే విషయం అర్థమైపోతుంది.





























