- Telugu News Photo Gallery Cinema photos Heroine Meenakshi Chaudhary gets huge movie offers in Tollywood on July 2024 Telugu Actress Photos
Meenakshi Chaudhary: చాప కింద నీరులా దూసుకొస్తున్న మీనాక్షి చౌదరి.! నెక్స్ట్ ఆ హీరోతేనే..
ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నానంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు. విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు నటిస్తూ.. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా..? కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది.
Updated on: Jul 29, 2024 | 12:23 PM

ఇండస్ట్రీలో ఎవరి టైమ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పడం కష్టం. ఓ హీరోయిన్ విషయంలో ఇదే జరుగుతుందిప్పుడు. శ్రీలీల జోరు కాస్త తగ్గగానే మరో హీరోయిన్ నేనున్నానంటూ టాప్ చైర్ వైపు అడుగులు వేస్తున్నారు.

విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు నటిస్తూ.. సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమాగా మారిపోతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దామా..? కొందరు హీరోయిన్లకు అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది.

మీనాక్షి చౌదరి విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీ.. రవితేజ ఖిలాడీలో నటించారు.

కానీ రెండూ ఫ్లాప్ అవ్వడంతో ఈమెపై చర్చ జరగలేదు. హిట్ 2 హిట్టైనా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. శ్రీలీల జోరు కాస్త తగ్గుతుండటంతో మీనాక్షి పేరు గట్టిగానే వినిపిస్తుంది.

గుంటూరు కారంలో గురూజీ ఇంపార్టెన్స్ లేని కారెక్టర్ ఇచ్చినా బాగానే రిజిష్టర్ అయ్యారు ఈ భామ. ప్రస్తుతం చేతినిండా సినిమాలున్నాయి మీనాక్షి చౌదరికి.

ఓ వైపు దుల్కర్‌తో నటిస్తున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న వస్తుంటే.. అక్టోబర్ 31న విశ్వక్ సేన్‌తో నటిస్తున్న మెకానిక్ రాకీ వచ్చేస్తుంది. నెల రోజుల గ్యాప్‌లోనే దుల్కర్ సల్మాన్, విశ్వక్ సినిమా వస్తున్నాయి.

వరుణ్ తేజ్ పాన్ ఇండియన్ సినిమా మట్కాతో పాటు.. విజయ్ హీరోగా వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న GOATలోనూ మీనాక్షే హీరోయిన్. వీటన్నింటికీ తోడు చిరంజీవి విశ్వంభరలో కీలక పాత్ర చేస్తున్నారు మీనాక్షి. ఇవన్నీ హిట్టైతే అమ్మడి రేంజ్ మరింత పెరగడం ఖాయం.





























