AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ATM: ఇక బాదుడే.. బాదుడు.. మే 1 నుంచి ఏటీఎం నిబంధనలు మార్పు.. ఛార్జీల మోత!

ATM Rules: మీరు ఏటీఎం నుంచి విత్‌డ్రా చేస్తుంటారా..? అయితే మే 1వ తేదీ నుంచి ఏటీఎం విత్‌డ్రాలో నిబంధనలు మారనున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ఏటీఎంల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

ATM: ఇక బాదుడే.. బాదుడు.. మే 1 నుంచి ఏటీఎం నిబంధనలు మార్పు.. ఛార్జీల మోత!
Subhash Goud
|

Updated on: Mar 25, 2025 | 7:26 PM

Share

మీకు నుంచి నుండి పదే పదే డబ్బులు తీసుకునే అలవాటు ఉంటే, కొన్ని రోజుల్లోనే ఈ అలవాటును సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. మే 1 నుండి ఏటీఎం నుండి డబ్బు తీసుకోవడం ఖరీదైనదిగా మారబోతోంది. ఏటీఎం ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకులకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని కారణంగా ఏదైనా ఉపసంహరణ జరిగితే లేదా హోమ్ బ్యాంక్ నెట్‌వర్క్ వెలుపల ఉన్న ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేస్తే అది మీకు మునుపటి కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

ఏటీఎం ఛార్జీలు ఎంత పెరుగుతాయి?

గతంలో మీరు మీ హోమ్‌ బ్రాంచ్‌ బ్యాంకు ఏటీఎం నుండి కాకుండా వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటే మీరు రూ. 17 చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడు అది రూ. 19 అవుతుంది. ఇతర బ్యాంకు ATM నుండి బ్యాలెన్స్ తనిఖీ చేయడానికి, గతంలో ఒకరు 6 రూపాయలు చెల్లించాల్సి ఉండేది. ఇప్పుడది 7 రూపాయలకు పెరగనుంది.

ఉచిత లావాదేవీ పరిమితి:

లావాదేవీ రుసుము ఇతర బ్యాంకు ఏటీఎం నుండి మాత్రమే వసూలు చేయబడుతుంది. మీరు ఉచిత లావాదేవీ పరిమితిని దాటినప్పుడు మెట్రో నగరాల్లో, హోమ్ బ్యాంక్ కాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి ఉచిత లావాదేవీల పరిమితి 5 అయితే, మెట్రోయేతర నగరాల్లో ఉచిత లావాదేవీల పరిమితి 3. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC) పంపిన ATM ఫీజులను పెంచే ప్రతిపాదనను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ కింద ఒకేసారి రూ.4 వేలు
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
నల్లగా బొగ్గులా మారిన వెండి మళ్ళీ ప్రకాశిస్తుంది..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి..
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
5 సిక్సర్లు, 12 ఫోర్లు.. 55 బంతుల్లో సెంచరీ.. వైభవ్ కన్నా డేంజరస్
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
ప్రపంచంలో ఎత్తైన ప్రాంతంలో షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమా
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్