సాయిధరమ్ కమ్ బ్యాక్ అదిరిపోయింది. 'విరూపాక్ష' మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది.ఏప్రిల్ 21న సినిమాకు జనాలు బాగా ఆదరిస్తున్నారు. యాక్సిడెంట్ తరువాత తేజూ నటించిన ఫస్ట్ సినిమా కావడంతో విరూపాక్షపై మెగా ఫ్యాన్స్‌లో కూడా ఎంతో ఆసక్తి ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే ఇవ్వడంతో పాటు, ఈ సినిమా ప్రొడక్షన్‌లో కూడా భాగస్వామి కావడంతో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలు అందుకోవడంతో విరూపాక్ష సక్సెస్ అయ్యింది.