- Telugu News Photo Gallery Cinema photos Venkatesh in touch with 4 production companies, how will his next movie be after Sankranthiki Vasthunam
Venkatesh: 4 ప్రొడక్షన్ హౌస్ ల తో టచ్ లో వెంకీ.. నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుంది ??
వెంకటేష్ తర్వాతి సినిమా ఏంటి..? మామూలుగా అయితే వెంకీ మామ నెక్ట్స్ సినిమా గురించి అంత ఆసక్తి ఉండేది కాదేమో..? కానీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఈయనేం చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. మరి వెంకీ నెక్ట్స్ సినిమా ఎలా ఉండబోతుంది..? మరోసారి ఫ్యామిలీ కథతోనే రాబోతున్నారా..?
Updated on: Feb 11, 2025 | 4:47 PM

సంక్రాంతికి సైలెంట్‌గా వచ్చి.. వైలెంట్‌గా ఇండస్ట్రీ హిట్ కొట్టారు వెంకటేష్. అసలెవరూ ఊహించని స్థాయిలో 300 కోట్లు వసూలు చేసి.. పండక్కి సెన్సేషన్ క్రియేట్ చేసారు.

దాంతో వెంకీ నెక్ట్స్ సినిమా ఏమై ఉంటుందా అనే ఆసక్తి మొదలైందిప్పుడు. ఈయన కోసం 4 ప్రొడక్షన్ హౌజ్‌లు అయితే వేచి చూస్తున్నారు.. కానీ ఏదీ కన్ఫర్మ్ చేయలేదు.

గతేడాది వెంకీ ఫోకస్ అంతా సంక్రాంతికి వస్తున్నాంపైనే పెట్టారు. ఇది పూర్తయ్యాకే నెక్ట్స్ సినిమాపై దృష్టి పెట్టాలని ఫిక్సయ్యారు వెంకటేష్. ఆ మధ్య నెక్ట్స్ ఏంటి అని అడిగితే.. చూద్దాం మెల్లగా.. కంగారేం లేదుగా అన్నారు ఈ సీనియర్ హీరో.

కాకపోతే మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్, స్వప్న సినిమాతో పాటు సురేష్ ప్రొడక్షన్స్‌లో వెంకీకి నెక్ట్స్ కమిట్‌మెంట్స్ ఉన్నాయి. తరుణ్ భాస్కర్‌తో పాటు DJ టిల్లు ఫేమ్ విమల్ కృష్ణ కూడా వెంకటేష్‌కు కథలు చెప్పారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది.

అలాగే అనుదీప్ కేవీ పేరు వినిపించినా.. విశ్వక్ సేన్ సినిమాతో బిజీ అయ్యారీయన. దాంతో వెంకీ నెక్ట్స్ సినిమాపై ఈ సస్పెన్స్ ఇంకొన్నాళ్లు తప్పకపోవచ్చు. తర్వాతి ప్రాజెక్ట్ ఎప్పుడున్నా.. మరోసారి ఫ్యామిలీ కథతోనే రావాలని చూస్తున్నారు వెంకీ.




