- Telugu News Photo Gallery Cinema photos Aishwarya Rajesh says she wants to go to dinner with actor Vijay
ఆ స్టార్ హీరోతో డిన్నర్‌కు వెళ్లాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ఐశ్వర్య రాజేష్
ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె తల్లి నాగమణి ప్రసిద్ధ నృత్యకారిణి. చిన్నతనం నుంచి చెన్నైలో పెరిగిన ఐశ్వర్య రాజేష్.. తన ప్రాథమిక విద్యను హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ నుంచి పూర్తి చేసింది.
Updated on: Feb 12, 2025 | 11:34 AM

ఐశ్వర్య రాజేష్.. ఇప్పుడు ఈ చిన్నదని పేరు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తుంది. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్ నటించి మెప్పించింది.

ఐశ్వర్య రాజేష్ తమిళ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అక్కడ వరుసగా సినిమాలు చేసి పాపులర్ అయ్యింది. ఐశ్వర్య రాజేష్ జనవరి 10, 1990లో చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి రాజేష్ 80వ దశకంలో తెలుగు చిత్రసీమలో స్టార్ హీరో. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు.

ఆమె తల్లి నాగమణి ప్రసిద్ధ నృత్యకారిణి. చిన్నతనం నుంచి చెన్నైలో పెరిగిన ఐశ్వర్య రాజేష్.. తన ప్రాథమిక విద్యను హోలీ ఏంజెల్స్ ఆంగ్లో ఇండియన్ హైస్కూల్ నుంచి పూర్తి చేసింది. ఆ తర్వాత చెన్నైలోని ఇతిరాజ్ మహిళా కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేసింది.

2010లో పంచ్ భరత్ దర్శకత్వం వహించిన “నీతనా అవన్” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీతోనే సినీరంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 2017లో మలయాళంలో “జోమొండే సువిసెసమల్” ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత వెట్రి మారన్ దర్శకత్వం వహించిన 2018 చిత్రం “వడ చెన్నై” తమిళ సినిమా అతిపెద్ద హిట్ గా నిలిచింది.

ఇక కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా మిస్ మ్యాచ్, వరల్డ్ ఫేమస్ లవర్,టక్ జగదీష్,రిపబ్లిక్ సినిమాల్లో నటించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య రాజేష్‌ను ఏ హీరోతో కలిసి డిన్నర్ చేయాలనుకుంటున్నారన్న ప్రశ్న ఎదురైంది. దానికి ఆమె దళపతి విజయ్‌తో డిన్నర్‌కి వెళ్లాలని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.




