- Telugu News Photo Gallery Cinema photos Actress Parvati Nair Married Hyderabad Businessmen Aasrith Ashok, See Photos
Tollywood: బిజినెస్ మెన్‌తో కలిసి పెళ్లిపీటలెక్కిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. బ్యూటిఫుల్ ఫొటోస్ చూశారా?
ప్రముఖ హీరోయిన్ పెళ్లిపీటలెక్కింది. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో కలిసి ఏడడుగులు వేసింది. అనంతరం తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Updated on: Feb 11, 2025 | 5:07 PM

మలయాళ ప్రముఖ హీరోయిన్ పార్వతి నాయర్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన అందం, అభినయంతో దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది.

హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆశ్రిత్ అశోక్‌తో కలిసి పార్వతి మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది.

వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది పార్వతి నాయర్. దీంతో ఇవి కొద్ది క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మరాయి.

పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు పార్వతి నాయర్- అశ్రిత్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కలిపి మొత్తం 30కు పైగా సినిమాల్లో నటించింది పార్వతి నాయర్. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని సరసన జెండాపై కపిరాజు సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది.

ఇక అజిత్ ఎంతవాడు గానీ, ఓవర్ టేక్, విజయ్ దళపతి ది గోట్ సినిమాలు పార్వతికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాగా తమది ప్రేమ వివాహమని తెలిపిన పార్వతి.. అశ్రిత్‌కు సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.




