Anasuya Bharadwaj: నాకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే చెప్పా.. అనసూయ పోస్ట్ వైరల్
జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ.ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది.
Updated on: Feb 12, 2025 | 2:20 PM

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరు రెగ్యులర్ గా వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ అందాల భామకు ఉన్న క్రేజ్ గురించి, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అనసూయ. ఆతర్వాత సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంది.

జబర్దస్త్ ద్వారా అనసూయ బాగా పాపులర్ అయ్యింది. ఈ కామెడీ షోలో తన యాంకరింగ్ తో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది. ఇక సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది ఈ బ్యూటీ. అలాగే పలు టీవీ షోలతోనూ బిజీగా ఉంది అనసూయ.

ఇక సోషల్ మీడియాలోనూ అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన గ్లామరస్ ఫొటోలతో పాటు తనపై ట్రోల్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అనసూయ హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇప్పుడు అనసూయ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అనసూయ తన డ్రస్సింగ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. బికినీ వేసుకుంటా లేదంటే మరొకటి చేస్తా మీకెందుకు అంటూ మాట్లాడింది అనసూయ .

ఈ కామెంట్స్ వైరల్ అవ్వడంతో అనసూయ దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “నేను నాకు ఎదురైన అనుభవాన్ని, నేను చూసిన సంఘటనల గురించి మాత్రమే చెప్పాను. ఎవరిని నేను బ్లేమ్ చేయడం లేదు. కానీ అవగాహన కల్పించడం కోసమే మాట్లాడాను. ఆడియన్స్ కి, మీడియాకి నేనుఎం సిన్సియర్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఎవరూ కూడా నా మాటలను వక్రీకరించి, నేను అనని మాటలను అన్నట్టు ప్రొజెక్ట్ చెప్పవద్దు. ఇలాంటివి నా క్యారెక్టర్ ను డిసైడ్ చేయలేవు. ఎప్పటికైనా నిజమే నిలుస్తుంది. నన్ను అర్థం చేసుకున్న వారికి మాత్రమే నా ప్రేమను అందిస్తాను” అంటూ రాసుకొచ్చింది అనసూయ.




