Movie News :టాలీవుడ్ టు బాలీవుడ్.. న్యూ మూవీ క్రేజీ అప్డేట్స్..
అబ్బాయ్ 'బ్రో' పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్ 'బ్రో' మార్నింగ్ షో చూశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో, సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ఈ సినిమాను చూశారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా 'బ్రో'. శుక్రవారం విడుదలైంది.
Updated on: Jul 28, 2023 | 8:36 PM

లక్కీ దుల్కర్ శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న సినిమా 'లక్కీ భాస్కర్'. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వెర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన మామూలు వ్యక్తి కథతో 'లక్కీ భాస్కర్'ని తెరకెక్కిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

అబ్బాయ్ 'బ్రో' పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరానందన్ 'బ్రో' మార్నింగ్ షో చూశారు. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్‌లో, సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ఈ సినిమాను చూశారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్‌తేజ్ నటించిన సినిమా 'బ్రో'. శుక్రవారం విడుదలైంది.

ఏపీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి 'బ్రో' సినిమాలో నటించడం ఆనందంగా ఉందంటూ నటి ఊర్వశి రౌతేలా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. 'బ్రో' సినిమాలో ఓ పాటకు స్టెప్పులేశారు ఊర్వశి రౌతేలా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ పాల్గొన్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా ఆమె పెట్టిన పోస్టులో పవన్‌ని సీఎం అనడంతో ట్రోల్స్ మొదలయ్యాయి.

ఇటీవల 'ఆదిపురుష్'తో ప్రేక్షకులను పలకరించారు నటి కృతి సనన్. రీసెంట్‌గా సొంత ప్రొడక్షన్ హౌస్ బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ ని ప్రారంభించారు. తాజాగా, తన పుట్టినరోజును పురస్కరించుకుని బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. వినియోగదారులకు క్వాలిటీ స్కిన్ కేర్ ప్రాడెక్ట్స్ అందించాలని అనుకున్నట్టు తెలిపారు కృతి.

వికాస్ వశిష్ట ,మోక్ష, కుషిత హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'నీతోనే నేను'. శ్రీ మామిడి ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై రూపొందించారు. అంజి రామ్ దర్శకత్వం వహించారు. ఎం సుధాకర్ రెడ్డి నిర్మించారు..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఆవిష్కరించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది 'నీతోనే నేను'




