పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన బ్రో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ సూపర్ హిట్ వినోదయ సిత్తమ్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సముద్రఖని దర్శకుడు. సినిమా రిలీజ్ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు సాయి ధరమ్ తేజ్, చిన్నతనంలో పవన్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు.